Supreme Court of India: ఏడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. సంచలన తీర్పునిచ్చిన సుప్రీం ధర్మాసనం..
Supreme Court of India: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ ఓ రేప్ కేసులో సంచలన తీర్పునిచ్చింది. మనిషి రూపంలో ఉన్న ఆ మృగాడికి..
Supreme Court of India: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ ఓ రేప్ కేసులో సంచలన తీర్పునిచ్చింది. మనిషి రూపంలో ఉన్న ఆ మృగాడికి మరణదండన విధించింది. అభం శుభం తెలియని చిన్నారిని అత్యంత పాశవికంగా రేప్ చేసి.. ఆపై హతమార్చిన ఆ కిరాతకుడికి మరణశిక్షే సరియైనదిగా భావించిన ధర్మాసనం.. అతనికి ఉరి శిక్ష విధించింది. ఈ ఘటన అత్యంత అమానవీయ, కిరాతకమైన చర్యగా అభివర్ణించింది ధర్మాసనం. రాజస్థాన్‌కు చెందిన ఏడున్నరేళ్ల బాలిక శారీరకంగా, మానసికంగా వికలాంగురాలు. ఆ చిన్నారిపై కన్నేసిన కామాంధుడు.. కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఆపై అత్యంత కిరాకతకంగా చంపేశాడు. ఈ ఘటన 2013లో చోటు చేసుకోగా.. యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తాజాగా తీర్పు వెల్లడించిన ధర్మాసనం.. నిందితుడికి మరణశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది.