ప్రెగ్నెన్సీ సాకు చూపి సెలవులు తీసుకుంటున్నారు.. మహిళా అధికారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు..
కర్నాటకలో అధికార పార్టీ ఎమ్మెల్యే మహిళా అధికారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనుల సమీక్షలో పాల్గొన్న చన్నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శివగంగ బసవరాజ్... ఆ సమావేశానికి పారెస్ట్ ఆఫీసర్ శ్వేత హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోరు పారేసుకున్నారు. దీంతో పలువురు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కర్నాటకలో అధికార పార్టీ ఎమ్మెల్యే మహిళా అధికారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనుల సమీక్షలో పాల్గొన్న చన్నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శివగంగ బసవరాజ్… ఆ సమావేశానికి పారెస్ట్ ఆఫీసర్ శ్వేత హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేత గర్భవతి కావడంతో రాలేకపోయారని ఇతర అధికారులు వివరణ ఇచ్చినా, ఎమ్మెల్యే వినకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె గర్భవతి అయితే మ్యాటర్నిటీ లీవ్ తీసుకొని ఇంటి దగ్గరే ఉండాలి కాని… సమావేశానికి పిలిస్తే సెలవు కావాలని అడుగుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. “జీతం కావాలి, ప్రయోజనాలు కావాలి కానీ పని మాత్రం చేయరంటూ నోరు పారేసుకున్నారు. ప్రెగ్నెన్సీని ఒక సాకుగా చూపి సెలవులు తీసుకోవడానికి సిగ్గు లేదా? అంటూ అనుచితంగా మాట్లాడారు.
కర్నాటక ప్రభుత్వం ఇటీవలనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేసే మహిళలకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు ప్రకటించి, మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న సమయంలో… అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
వీడియో చూడండి..
బసవరాజ్ ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి మహిళా అధికారిణి గురించి అనుచితంగా మాట్లాడడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పించాలని మహిళా హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటక బీజేపీ నేతలు ఎమ్మెల్యే బసవరాజ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వానికి మహిళలు అంటే కనీస గౌరవం లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




