AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Live: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. ప్రత్యక్ష ప్రసారం

PM Modi Live: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. ప్రత్యక్ష ప్రసారం

Shaik Madar Saheb
|

Updated on: Oct 16, 2025 | 10:57 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మోదీకి గవర్నర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, లోకేష్‌ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మోదీ ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రధాని మోదీ పర్యటన ఇలా..

ప్రధాని మోదీ ఉదయం 11:15కి భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12:05 వరకు ఆలయంలోనే ఉంటారు. దాదాపు 50 నిమిషాలపాటు మల్లన్నస్వామి సన్నిధిలో గడుపుతారు. ఆ తర్వాత శ్రీశివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. 12:15 నుంచి 12:35వరకు అక్కడే ఉంటారు. అనంతరం 12:45కి భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని.. మధ్యాహ్నం 1:15 వరకు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 1:20కి శ్రీశైలం నుంచి బయల్దేరి 2:20కి కర్నూలు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30కి కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొంటారు. సభా ప్రాంగణం నుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తిరిగి, సాయంత్రం 4:45కి కర్నూలు ఓర్వకల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.

Published on: Oct 16, 2025 10:37 AM