Narendra Modi: నేడు ‘మన్ కీ బాత్’.. కీలక అంశాలపై మాట్లాడనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Mann Ki Baat – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11గంటలకు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి

Narendra Modi: నేడు 'మన్ కీ బాత్'.. కీలక అంశాలపై మాట్లాడనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ
Pm Narendra Modi
Follow us

|

Updated on: Apr 25, 2021 | 9:17 AM

Mann Ki Baat – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11గంటలకు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతినెలా జరిగే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 76 వ ఎపిసోడ్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. దీనిలో ప్రధాని మోదీ ఎన్నో విషయాలపై ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగం.. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, న్యూసోనైర్ మొబైల్ యాప్‌లో ప్రసారం కానుంది.

కాగా.. దేశంలో కొన్ని రోజుల నుంచి కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. నిత్యం 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది కరోనా మహమ్మారితో మరణిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనే ఆక్సిజన్ కొరతతో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం నుంచి ప్రధాని మోదీ అధికారులతో, సీఎంలతో సంభాషించారు. అయితే పెరుగుతున్న కరోనా కేసుల మధ్య పలు కీలక విషయాలను ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. దీంతోపాటు పలు సూచనలు కూడా చేసే అవకాశం ఉంది.

కాగా.. ప్రధాని మోదీ మార్చిలో జరిగిన 75వ మన్‌కీ బాత్ ఎపిసోడ్‌లో.. గతేడాది జనతా కర్ఫ్యూలో కరోనా-యోధులు చేసిన కృషిని.. ప్రజల క్రమశిక్షణను ప్రశంసించారు. దీంతోపాటు.. ‘అమృత్ మహోత్సవ్’ గురించి కూడా మాట్లాడారు. ఇది దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళుతుందని.. దేశం కోసం ఏదైనా చేయాలనే అభిరుచిని పెంచుతుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. “మన్ కి బాత్” కార్యక్రమం ప్రతినెలా చివరి ఆదివారం ప్రసారం అవుతుంది.

Also Read:

ఇండియాలో పరిస్థితి దారుణం, సాయం చేయండి.. క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ అభ్యర్థన

తాగునీటిలో వైరస్.. మరింత ప్రమాదకరం కానుందా ? కీలక విషయాలను చెప్పిన సీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్ర..