తాగునీటిలో వైరస్.. మరింత ప్రమాదకరం కానుందా ? కీలక విషయాలను చెప్పిన సీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్ర..

Corona Virus: దేశవ్యాప్తంగా కరోనా మారCorona Virus: దేశవ్యాప్తంగా కరోనా మారణ హోమం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఉండే

తాగునీటిలో వైరస్.. మరింత ప్రమాదకరం కానుందా ? కీలక విషయాలను చెప్పిన సీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్ర..
Rakesh Mishra
Rajitha Chanti

|

Apr 25, 2021 | 8:48 AM

Corona Virus: దేశవ్యాప్తంగా కరోనా మారణ హోమం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఉండే స్థితి గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల తాగేనీటిలో కరోనా వ్యాప్తి చెందుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర వివరణ ఇచ్చారు. తాగేనీటిలోనూ కరోనా రెండు రోజుల పాటు బతికే ఉంటుందని తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్ బతికి ఉంటుందని అన్నారు. కొవిడ్ వైరస్ పై అవగాహన కల్పించేందుకు జూమ్ లో శనివారం ఆయన సీసీఎంబీలో కరోనా వైరస్ జన్యుక్రమ ఆవిష్కరణలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న దివ్వతేజ్ కార్తీక్ లతో కలిసి మాట్లాడారు.

4 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు చల్లని నీటిలో వైరస్‏కు ఇన్‏ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉంటుంది. వేడి నీళ్ళలో 65 డిగ్రీల వద్ద వైరస్ నిమిషాల వ్యవధిలోనే చనిపోతుంది. నీటిలోని వైరస్ ఒక్కటే ఇన్‏ఫెక్షన్ కలిగించలేదు.. అది శరీరంలోకి వెళ్ళాలంటే ప్రత్యేకించి కొన్ని వందల కణాలు కావాల్సి ఉంటుంది. అయితే తాగిన నీరు నేరుగా పొట్టలోకి వెళ్తుంది. కాబట్టి ప్రమాదమేమి లేదు. తాగునీటి ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందిన కేసులు మన దేశంలో ఎక్కడా నమోదు కాలేదు. కాబట్టి అదేమంత ఆందోళన కలిగించే విషయం కాదు. ముందుజాగ్రత్తగా వేడి చేసిన గోరు వెచ్చని నీటిని, వేడి పదార్థాలనే తీసుకోవడం మంచిది. ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు గాలి ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తి చెందుతోంది అని తెలిపారు.

అలాగే కరోనా వైరస్ ఎప్పటికి అంతమవుతుందనేది చెప్పలేం. అందరూ టీకాలు వేయించుకోవడం, జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని రెండు నెలల్లో నియంత్రించగలుగుతామన్నారు. అలాగే రాబోయే రోజులలో మరిన్ని ఔషదాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. క్లినికల్ గా చెప్పాలంటే మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ లో పెద్దగా మార్పులు ఏమి లేవు. అవే లక్షణాలు, మరణాల రేటు కూడా అదే విధంగా ఉంది. ఈసారి వేగంగా వ్యాపిస్తుందని, పిల్లలకు ఎక్కువగా సోకుందనే ప్రచారం జరుగుతోంది. దీని గురించి కచ్చితమైన అధ్యయనాలు లేవు. పెళ్ళిళ్లు, పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలి. జనసమ్మర్థం ఉండే ప్రదేశాలకు వెళ్ళవద్దు. గాలి, వెలుతురు లేని గదులలో ఎక్కువ సేపు ఉండకూడదు. దోమల ద్వారా వైరస్ వ్యాప్తి చెందదు అని రాకేశ్ మిశ్ర తెలిపారు.

Also Read: ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..

ఎల్ఐసీ పాలసీదారులరా అలర్ట్.. ఇన్సూరెన్స్, ప్రీమియం స్టేటస్ చెక్ చేయండిలా.. మిగతా వివరాలకు SMS పంపండిలా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu