కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం అవుతుంది.? నిపుణులు చెబుతున్న మాటేంటంటే.!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందంటూ వస్తోన్న వార్తలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు...

కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకపోతే ఏం అవుతుంది.? నిపుణులు చెబుతున్న మాటేంటంటే.!
covid 19 Vaccine
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 25, 2021 | 8:40 AM

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందంటూ వస్తోన్న వార్తలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టీకా మొదటి డోసు తీసుకున్నవారు.. రెండోది మిస్సయితే ఏం అవుతుందోనని ఖంగారు పడుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు – భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్.. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోన్న కోవిషీల్డ్ – వీటిని వేర్వేరు డోసేజ్ ఇంటర్వల్స్ లో ప్రజలకు ఇస్తున్నారు.

కోవాగ్జిన్ రెండవ డోసు 28 రోజుల వ్యవధిలో తీసుకోవాల్సి ఉండగా, కోవిషీల్డ్ రెండవ మోతాదు నాలుగు నుండి ఎనిమిది వారాల మధ్య తీసుకోవాలని భారత ప్రభుత్వం సిఫార్సు చేస్తోంది.

ఏదేమైనా, లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ఎక్కువ సామర్ధ్యం ఉందని కనుగొంది. ఇది భారతదేశంలో కోవిషీల్డ్ పేరుతో అభివృద్ధి అవుతోంది. అయితే 12 వారాల తర్వాత మీరు రెండో మోతాదు తీసుకోకపోతే ఏం జరుగుతుంది.?

రెండవ డోస్ మిస్సయితే మీరు వైరస్ నుంచి రక్షించబడలేరని.. వైరాలజిస్ట్ డాక్టర్ జాకబ్ జాన్ చెప్పారు. “మీరు సంక్రమణకు గురైనట్లయితే, మీరు వ్యాధి బారిన పడవచ్చునని, వైరస్ తీవ్రత కూడా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.”

రెండు వ్యాక్సిన్లు వైరస్ పై పూర్తి స్థాయి ప్రభావం చూపించినా.. అది కూడా రెండు మోతాదులు తీసుకున్న తర్వాతే ప్రయోజనం ఉంటుందని అన్నారు. టీకా మొదటి డోస్ ఇన్ఫెక్షన్ రేట్ ను తక్కువ చేసినా.. రెండో డోస్ 90 శాతం వరకు సంక్రమణ రాకుండా చూసుకుంటుందని.. అందువల్ల నిర్దిష్ట సమయం కన్నా ఎక్కువైనా కూడా రెండో డోస్ తీసుకోవడం తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేశారు.