Covid 19 norms Violated: కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కిన మాజీ ఎమ్మెల్యే.. ఓ స్టార్‌తో కలిసి చిందులేసిన జేడీయు నేత
. వైరస్‌ను కట్టడి చేసేందుకు అధికారులు పలు కఠినమైన ఆంక్షలు విధిస్తుంటే కొందరేమో నిర్లక్ష్యం చేస్తూ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా బీహార్‌లో జేడీయు నేత, మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ అలియాస్ మున్నా శుక్లా రూల్స్ బ్రేేక్ చేశారు.
Ex MLA Covid 19 Rules Break: దేశం కరోనాతో అల్లకల్లోలమవుతుంటే.. ఒక వైపు కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు అధికారులు పలు కఠినమైన ఆంక్షలు విధిస్తుంటే కొందరేమో నిర్లక్ష్యం చేస్తూ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా బీహార్‌లో జేడీయు నేత, మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ అలియాస్ మున్నా శుక్లా మాత్రం కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కుతూ వేడుకలు జరుపుకున్నారు. బోజ్‌పురీ స్టార్ అక్షరాసింగ్ ఈ పార్టీ లో ఆట పాట ప్రదర్శించింది. మేనల్లుడి ఉపనయనంలో ఆటా పాటలతో పాటు గాల్లో ఫైరింగ్ కూడా చేశారు ఈ మాజీ ఎమ్మెల్యే. ఈయన జైల్లోనే పీహెచ్‌డి పూర్తి చేశారు. డిసెంబర్ 5, 1994 లో ఆంధ్రప్రదేశ్ 1985 బ్యాచ్ IAS ఆఫీసర్..అప్పటి గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ జి క్రిష్ణయ్యను చంపిన కేసులో జైల్లో ఉండి కూడా మందు, బార్ డాన్సర్ల చిందు అనుభవించిన ఘనుడు. క్రేజీ బార్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న బాహుబలి.
అయితే తన మేనల్లుడి ఉపనయనం కోసం పెద్ద పార్టీనే ఏర్పాటు చేశారు విజయ కుమార్. వారిని మరింతగా ఆకట్టుకునేందుకు కోవిడ్ నిబంధనలు లెక్క చేయకుండా పాటలకు డ్యాన్స్‌లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్థరాత్రి పూట కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి సదరు మాజీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడిపోయారు.
Read Also… Shantanagoudar: సుప్రీంకోర్టు న్యాయమూర్తి శాంతనగౌడర్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..