Shantanagoudar: సుప్రీంకోర్టు న్యాయమూర్తి శాంతనగౌడర్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
Mohan M Shantanagoudar: సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ మోహన్ ఎం. శాంతనగౌడర్ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న
Mohan M Shantanagoudar: సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ మోహన్ ఎం. శాంతనగౌడర్ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న శాంతనగౌడర్ గురుగ్రాంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శాంతనగౌడర్ న్యుమోనియా బారినపడ్డారు. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో గురుగ్రాంలోని మెదాంతా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. గతేడాది తన తల్లిని ఖననం చేసిన చోటనే తననూ ఖననం చేయాలనేది జస్టిస్ శాంతనగౌడర్ చివరి కోరిక అని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన లింగాయత్ సమాజానికి చెందిన వారు. ఈ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే ఖననం చేస్తారు.
ఉత్తర కర్ణాటకకు చెందిన శాంతనగౌడర్ 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. శాంతనగౌడర్ 2023 మే 4న రిటైర్ కావాల్సి ఉంది. 1980లో అడ్వకేట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన సివిల్, క్రిమినల్, రిట్ పిటిషన్ల కేసులు చేపట్టేవారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన శాంతనగౌడర్ 2004లో సుప్రీంకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా.. మోహన్ ఎం. శాంతనగౌడర్ మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తంచేశారు.
Also Read: