Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Lockdown: ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా.. కేరళలో కఠిన ఆంక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల పాటు లాక్‌డౌన్..

కరోనా వైరస్ ప్రపంచంలోని అనేక దేశాల్లో విజృంభిస్తుంది. ఇప్పుడు భారత్ లో కూడా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. దీంతో వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి.

Kerala Lockdown: ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా.. కేరళలో కఠిన ఆంక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల పాటు లాక్‌డౌన్..
Kerala Lockdown
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 25, 2021 | 6:50 AM

Kerala Imposes 48 hour Lockdown: కరోనా వైరస్ ప్రపంచంలోని అనేక దేశాల్లో విజృంభిస్తుంది. ఇప్పుడు భారత్ లో కూడా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. దీంతో వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కఠిన ఆంక్షలు విధిస్తున్న రాష్ట్రాల జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు కఠినతరం చేసింది. ఇందులో భాగంగా 48 గంటల పాటు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను విధించింది.

కేరళ రాష్ట్రంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న పోలీసులు నిబంధనలు పాటించనివారిపై జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చిరస్తున్నారు. సరైన పత్రాలను చూపించిన వారిని మాత్రమే వదిలేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, వ్యాపార సముదాయాలు, కూరగాయల మార్కెట్లలో రద్దీ తగ్గింది. కేరళలో శుక్రవారం కొత్తగా రికార్డుస్థాయిలో 28 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు.. ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తెచ్చినవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

Read Also…  Corona effect: కరోనా కాటుకు మరో పూజారి బలి.. ఆరోగ్యం విషమించి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకుడు మృతి