AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ సేమ్ సీన్ ! కోవిడ్ పై ట్వీట్స్ ని బ్లాక్ చేయాలి, ట్విటర్ కి ప్రభుత్వ సూచన, పాక్షిక ఆమోదం

కోవిడ్ పరిస్థితిపైన, దీన్ని తాము హ్యాండిల్ చేస్తున్న  తీరుపైనా విమర్శనాత్మకంగా వస్తున్న ట్వీట్లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విటర్ ను కోరింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది.

మళ్ళీ సేమ్ సీన్ ! కోవిడ్ పై ట్వీట్స్ ని బ్లాక్ చేయాలి, ట్విటర్ కి ప్రభుత్వ సూచన, పాక్షిక ఆమోదం
Govt. Asks Twitter To Block Some Tweets On Handling Of Covid
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 25, 2021 | 7:37 AM

Share

కోవిడ్ పరిస్థితిపైన, దీన్ని తాము హ్యాండిల్ చేస్తున్న  తీరుపైనా విమర్శనాత్మకంగా వస్తున్న ట్వీట్లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విటర్ ను కోరింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. దీంతో ట్విటర్ చాలా ట్వీట్లను నిలిపివేసింది. ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ట్వీట్స్ చేసినవారిలో పలువురు ఎంపీలు, ఫిల్మ్ మేకర్లు, స్టార్స్ కూడా ఉన్నారు. బెంగాల్  మంత్రి మోలాయ్  ఘటక్, నటుడు వినీత్ కుమార్ సింగ్, ఫిల్మ్ మేకర్లు వినోద్ కాప్రి, అవినాష్ దాస్, రేవంత్ రెడ్డి వంటివారు ఉన్నారు. భారత ఐటీ చట్టాలకు అనుగుణంగా ఈ ట్వీట్స్  లేవని, చట్టాలను అతిక్రమించేవిగా ఉన్నాయని ప్రభుత్వం ట్విటర్ కు పంపిన తన నోటీసులో పేర్కొంది. ఈ ట్వీట్స్ లో చాలావరకు ప్రభుత్వాన్ని చాలామంది దుయ్యబట్టారు. దేశంలో కోవిడ్ పరిస్థితికి ప్రభుత్వానిదే  బాధ్యత అని, ఈ సర్కార్ కి ముందుచూపు లేని కారణంగానే ఇది విజృంభిస్తోందని వారు ఆరోపించారు. ఈ మహమ్మారి ఇంతగా ప్రబలంగా ఉన్నా  హరిద్వార్ లో మహా కుంభ్ మేళాకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని,  ముందు జాగ్రత్త చర్యలేవీ తీసుకోలేదని వారు పేర్కొన్నారు. దేశంలో రోగుల దయనీయ స్థితి, ఆక్సిజన్, మందుల కొరత, ఆసుపత్రుల్లో  బెడ్స్ కొరత వంటి వాటికి పూర్తిగా ఈ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఇవి సహజంగానే ప్రభుత్వ వర్గాలకు ఆగ్రహం కలిగించింది.

కొన్ని  వివాదాస్పద ట్వీట్స్ అయితే విదేశాల్లో మాత్రమే దర్శనమిచ్చాయి. ఇండియాలో ఇవి కనబడలేదు. ముఖ్యంగా ఈ నెల 22-23 తేదీలలో వచ్చిన ట్వీట్స్ పై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వ నోటీసుకు స్పందించిన ట్విటర్ పాక్షికంగా చర్యలు తీసుకుంది. మరీ విమర్శనాత్మకంగా ఉన్న వాటిని బ్లాక్ చేసింది. లోగడ రైతుల నిరసనలపై వచ్చిన ట్వీట్స్ విషయంలో కూడా భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో అప్పుడు కూడా ఇలాగే ట్విటర్ చాలా ట్వీట్లను బ్యాన్ చేసింది. మరిన్ని చదవండి ఇక్కడ : Kerala Lockdown: ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా.. కేరళలో కఠిన ఆంక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల పాటు లాక్‌డౌన్.. Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?