Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Rates: దేశంలో ఇటీవల బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా స్వల్పంగా తగ్గింది. నిత్యం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
gold-price-today
Follow us

|

Updated on: Apr 25, 2021 | 6:23 AM

Today Gold Rates: దేశంలో ఇటీవల బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా స్వల్పంగా తగ్గింది. నిత్యం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. బంగారం ధరలు ఒక రోజు తగ్గుతుంటే.. మరోరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు చూస్తుంటారు. అయితే.. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల నుంచి బంగారం ప్రియులకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటీవల తగ్గుతూ వచ్చి ధరలు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల 40వేలకు దగ్గరలో వచ్చిన ధరలు.. మళ్లీ 44 మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 110 రూపాయల మేర తగ్గింది. శనివారం 45,060 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు ఆదివారం 44,950 గా ఉంది. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,250 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 50,470 గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,950 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,950 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,600 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,770 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,840 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం.. ధరలు..

కాగా హైదరాబాద్‌లో అత్యధికంగా పసిడి ధర 200 మేర తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,660 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,660 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Vaccination 3rd phase: కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గాదర్శాకాలు జారీ.. రాష్ట్రాలు కోవిన్ యాప్ లో టీకాల పంపిణీ వివరాలు నమోదు చేయాలని సూచన!

Oxygen: కరోనా పేషెంట్స్ కు ఆక్సిజన్ ఎప్పుడు అవసరం అవుతుంది? అసలు మన శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరం అవుతుంది?