Oxygen: కరోనా పేషెంట్స్ కు ఆక్సిజన్ ఎప్పుడు అవసరం అవుతుంది? అసలు మన శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరం అవుతుంది?

రోనా రెండో వేవ్ ఉదృతంగా ఉంది. కరోనాతో ఇబ్బంది పడి మరనిస్తున్నవారిలో ఎక్కువ శాతం సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. అసలు ఆక్సిజన్ మనిషికి ఎంత అవసరం?

Oxygen: కరోనా పేషెంట్స్ కు ఆక్సిజన్ ఎప్పుడు అవసరం అవుతుంది? అసలు మన శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరం అవుతుంది?
Oxygen Crisis
KVD Varma

|

Apr 24, 2021 | 10:55 PM

Oxygen: కరోనా రెండో వేవ్ ఉదృతంగా ఉంది. కరోనాతో ఇబ్బంది పడి మరనిస్తున్నవారిలో ఎక్కువ శాతం సరైన సమయంలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. అసలు ఆక్సిజన్ మనిషికి ఎంత అవసరం? ఎంత వరకూ ఆక్సిజన్ తగ్గినా మనిషి శరీరం తట్టుకుంటుంది? ఆక్సిజన్ తక్కువ అని ఎప్పుడు నిర్ధారిస్తారు? ఆక్సిజన్ గురించిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా.. మన ఊపిరి తిత్తులు నిమిషానికి 5 నుంచ 6 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ ను అవి పనిచేయడం కోసం వినియోగించుకుంటాయి. మన మొత్తం శరీరానికి నిమిషానికి 250 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఒకవేళ ఊపిరితిత్తులు కనుక అనారోగ్యం పాలైతే, వాటికి నిమిషానికి ఎప్పుడూ తీసుకునే ఆక్సిజన్ కంటె నాలుగురెట్లు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాయి.

మనం గాలిని పీల్చుకున్నపుడు ఊపిరితిత్తుల్లో మిలియన్ల గాలి చిన్న గా సోక్ అయి ఆక్సిజన్ లోపలి వెళుతుంది.. కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది. కోవిడ్ 19 వైరస్ ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ డిప్యూజ్ కాకుండా అడ్డుకుంటుంది. ఊపిరితిత్తుల్లో మంటను కలిగిస్తుంది. అదే విధంగా ఊపిరి తిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్ళే నాళాలు గడ్డకట్టేలా చేస్తాయి. దీంతో ఆక్సిజన్ నిరోధించబడుతుంది. ఇది శ్వాసకోశ వైఫల్యం అదేవిధంగా న్యుమోనియాకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో ఆక్సిజన్ బయట నుంచి ఇవ్వడం అవసరం అవుతుంది. ఆక్సిజన్ సాచురేషన్ శాతం 90 కంటె పడిపోయినపుడు ఆక్సిజన్ మద్దతు అవసరం అవుతుంది. కొన్ని ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు ఉన్న రోగుల విషయంలో కరోనా సోకిన వెంటనే ఆక్సిజన్ థెరపీ అవసరం అవుతుంది. అయితే, వైద్యుల పర్యవేక్షణలోనే ఆక్సిజన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతె అవయవాలు పాడైపోయే అవకాశం ఉంటుంది.

సాధారణంగా తేలికపాటి ఇబ్బందులు ఉన్నవారికి ఫేస్ మాస్క్ ద్వారా ఆక్సిజన్ ఇస్తే సరిపోతుంది. తీవ్రమైన ఇబ్బందులు ఉన్నవారికి ముక్కులో నాళం పెట్టడం ద్వారా అధిక ప్రవాహంలో ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది.

కరోనా మొదటి వేవ్ పరిస్థితుల్లో 41.5 శాతం మంది రోగులకు ఆక్సిజన్ అవసరం పడింది. అయితే ఇప్పుడు రెండో వేవ్ సమయంలో ఆసంఖ్య 54.5 శాతం మంది రోగులకు చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బాలరాం భార్గవ అన్నారు. దీనివలన ఆక్సిజన్ అందరికీ అందుబాటులో లేకపోవడం జరుగుతోంది. ఇక, ఢిల్లీలోని ఆసుపత్రులు, మహారాష్ట్ర వంటి బాగా దెబ్బతిన్న రాష్ట్రాలు పడకలు అలాగే ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కున్నాయి. ట్యాంకర్లను రవాణా చేయడానికి ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్‌ట్రాట్రిన్లు, వైమానిక దళ విమానాలు మరియు ట్రక్కులను ఉపయోగించి ఆసుపత్రులకు వైద్య ఆక్సిజన్‌ను పొందే ప్రయత్నాలను ప్రభుత్వం వేగవంతం చేసింది.

Also Read: Birthday Celebrations: ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకున్న యువతి..ముంబయి పోలీసుల స్పెషల్ గిఫ్ట్..ట్విట్టర్ లో ట్రెండింగ్!

Chasing Criminal: ముందు కారులో హంతకుడు.. వెనుక పోలీసులు.. సూపర్ ఛేజింగ్ సీన్.. ఇంతలో ఏమైందంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu