Viral: వాటర్ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
సాధారణంగా చేపటలు పట్టాలంటే చెరువులో గాలం వేస్తారు..లేదా వల వేస్తారు. కానీ వాటర్ బాటిల్‌లో చేపలు పట్టడం ఎప్పుడైనా చూశారా? ఇలాంటి ప్రయోగాలు చేయడంలో భారతీయులను మించినవారుండరు. చదువుతో పనిలేకుండా అద్భుతమైన ప్రతిభను చాటే ఎందరో మట్టిలో మాణిక్యాలు భారతదేశం సొంతం. సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి ఆణిముత్యాలు ఇటీవల వెలుగులోకి వస్తూ తమ సత్తా చాటుతున్నారు.
ఇలాంటి ఐడియాలు వెయ్యాలంటే కోనసీమ కుర్రాళ్ల తర్వాతే ఎవరైనా..తాజాగా ఈ కోనసీమ కుర్రాళ్లు చేపలను ఎంతో ఈజీగా పట్టేసే టెక్నిక్ కనిపెట్టారు. వలవేయకుండానే పెద్ద పెద్ద చేపలను టక టకాపట్టేస్తున్న వీరిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కోనసీమ కుర్రాళ్లా మజాకా అంటున్నారు.! అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యువకులు చేపలు పట్టడంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. వలతో పనిలేకుండా ఎంతో సులువుగా చేపలు పట్టేస్తూ చకచకా అమ్మేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. వలలేకుండా చేపలు ఎలా పడుతున్నారనుకుంటున్నారు కదా.. ఇదిగో ఇలా.. ఓ రెండు లీటర్ల వాటర్ బాటిల్ కు తాడు కట్టి బాటిల్ లో మైదా పిండి పెట్టి గోదావరి లో కి బాటిల్ ను విసురుతున్నారు. అంతే ఆహారం కోసం వచ్చిన చేపలు ఆ బాటిల్‌లోకి వెళ్ళగానే చకచకా బయటకు లాగేస్తున్నారు. ఏకంగా కిలో, రెండు కిలోల బరువుండే చేపలు బాటిల్‌కి చిక్కుతున్నాయి. దీంతో యువకుల ఆనందాన్నికి అవధులు లేకుండా పోయాయి.
ఇలా లైవ్ లో వచ్చిన చేపలను కొనడానికి యానాం పరిసర ప్రాంతాల్లో ఉన్న మాంస ప్రియులు క్యూకడుతున్నారు. యువకులు చేపలు పట్టే విధానం చూసి ఫిదా అయిపోతున్నారు. ఇక ఒక్కొక్క చేప 500 నుంచి 600 వందలకు విక్రయిస్తూ యువకులు డబ్బులు సంపాదిస్తున్నారు. వాటర్ బాటిల్‌తో చేపలు పట్టడం స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చేపల వేటను వీక్షించేందుకు గోదావరి వద్దకు స్థానికులు, చేపల కొనగోలుదారులు, సందర్శకులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో గోదారిగడ్డు సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ఇన్నాళ్లూ వలలతోనానా తంటాలు పడ్డాం కదరా.. అంటూ కొందరు మత్స్యకారులు సైతం ఆశ్చర్యపోయారు. యువకుల తెలివికి ప్రశంసించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

