Pawan Kalyan: రాయలసీమ ఎవరి జాగీరు కాదు.. అన్నీ సరిచేస్తా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
శనివారం అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గాలివీడులో దాడికి గురై.. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును పవన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందనేది ఆరా తీశారు. దాడి ఎందుకు జరిగింది. ఎవరెవరు అటాక్ చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గాలివీడు ఎంపీడీవో మీద దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. స్వయంగా వెళ్లి అధికారిని పరామర్శించిన పవన్ కల్యాణ్.. దాడి చేసిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. అందరి లెక్కలు సరిచేస్తామంటూ హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని.. అహంకారం తగ్గిస్తాం.. తోలుతీసి కూర్చోబెడతామని పేర్కొన్నారు.. శనివారం అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గాలివీడులో దాడికి గురై.. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును పవన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందనేది ఆరా తీశారు. దాడి ఎందుకు జరిగింది. ఎవరెవరు అటాక్ చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. భయంలో ఉన్న ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గాలివీడు ఎంపీడీవో ఆఫీసుకు పవన్ కల్యాణ్ వెళ్లారు. దాడి జరిగిన సమయంలో ఆఫీసులో ఉన్న సిబ్బందితో పవన్ మాట్లాడారు. దాడి ఘటనపై ఆరా తీశారు.
ఇది వ్యక్తి మీద కాదు రాష్ట్ర యంత్రాంగం మీద జరిగిన దాడిగా భావిస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 11 సీట్లు ఇచ్చినా వైసీపీకి అహంకారం తగ్గలేదంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అహంకారం తగ్గించేవరకు వదిలిపెట్టమని.. దాడులు చేస్తామంటే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. దాడికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదంటూ పవన్ హెచ్చరించారు. రాయలసీమ ఎవరి జాగీరు కాదు.. ముఠాలను పెట్టుకుని బెదిరిస్తే ఎవరూ భయపడరన్నారు.
ఆఫీసులకు వచ్చి అధికారులపై దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు పవన్ కల్యాణ్.. అవసరమైతే రాయలసీమలోనే క్యాంప్ ఆఫీసు పెట్టుకుని.. అన్నీ సరిచేస్తానన్నారు పవన్. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాం.. ఇలాంటి చిల్లర పనులు చేస్తూ.. తమ సహనాన్ని పరీక్షించొద్దన్నారు డిప్యూటీ సీఎం పవన్.
ఇదిలాఉంటే.. ఎంపీడీవోపై దాడి కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.. 9మంది పరారీలో ఉన్నారు.. పట్టుబడిన నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..