Viral: పార్క్‌లో కనిపించిన అరుదైన రాయి.. లక్ తెచ్చిపెడుతుందని ఇంటికి తెస్తే
అతడు గతంలో ఎన్నడూ ఈ రాయిని చూడలేదు. దాని లోపల బంగారం లేదా వజ్రం ఉండొచ్చునని భావించాడు. ఆ క్రమంలోనే ఇంటికి తీసుకొచ్చాడు. దాన్ని పగలుగొట్టేందుకు ప్రయత్నించాడు. సుమారు 9 ఏళ్ల పాటు ఆ రాయిని తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. తీరా చివరికి
ఓ వ్యక్తి పార్క్‌లో వాకింగ్‌కి వెళ్లగా.. అతడికో రాయి కనిపించింది. అందులో బంగారం ఏమైనా ఉండొచ్చునని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రాయిని పగలుగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. 9 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంచిన అతడు చివరికి విసిగిపోయి.. మ్యూజియం సిబ్బందికి చూపించాడు. దాని చరిత్ర తెలిసి షాక్ అయ్యాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..
వివరాల్లోకి వెళ్తే.. డేవిడ్ హోల్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి రంగురాళ్లు సేకరించడం అలవాటు. ఈ క్రమంలోనే 2015లో అతడు పార్క్‌లో వాకింగ్‌కి వెళ్లినప్పుడు ఓ రాయి వింతగా కనిపించింది. అందులో బంగారం లేదా వజ్రం ఉండొచ్చునని భావించిన అతడు.. దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ రాయిని పగలుగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. చివరికి అతడి ఆశ నిరాశ కాగా.. 9 ఏళ్ల తర్వాత ఆ రాయిని మ్యూజియం వాళ్లకు అప్పగించాడు.
అక్కడున్న శాస్తవేత్తలు దాన్ని పరిశీలించగా.. అది అత్యంత అరుదైన గ్రహశకలం అని.. అంగారకుడు, బుధుడు మధ్య ఉన్న గ్రహశకలాల రాసి నుంచి ఇది భూమిపై పడి ఉండొచ్చునని వివరించారు. ఘనీభవించిన ఇనుము, ఇతర లోహాలతో ఈ రాయి తయారైందని చెప్పారు. దాదాపు 17 కిలోల బరువున్న ఈ గ్రహశకలం సుమారు వెయ్యేళ్ల క్రితం భూమిపైకి వచ్చిందన్నారు. దీన్ని అధ్యయనం ద్వారా విశ్వానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చునని అన్నారట. అలాగే ఈ గ్రహశకలం ఖరీదు కొన్ని మిలియన్ల డాలర్లు ఉండొచ్చునట.
ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి