AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే.. 12 ఫోర్లు, 4 సిక్సర్లతో పెను తుఫాన్

ఆ ప్లేయర్ టీ20లకు పనికి రాడని ఇండియన్ ప్రీమియర్ లీగ్ వద్దంది.. కానీ ఆస్ట్రేలియా మాత్రం అతడే ముద్దంది. జట్టులో చోటు ఇచ్చింది. కట్ చేస్తే.. తన సత్తా చాటుతూ తాజా మరో సెంచరీ చేశాడు ఈ ఆటగాడు. మరి అతడెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే.. 12 ఫోర్లు, 4 సిక్సర్లతో పెను తుఫాన్
Bbl 2024 25
Ravi Kiran
|

Updated on: Dec 27, 2024 | 3:00 PM

Share

బిగ్ బాష్ లీగ్ 11వ మ్యాచ్‌ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 8 వికెట్ల తేడాతో మెల్‌బోర్న్ స్టార్స్‌పై అద్భుత విజయం సాధించింది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని సిడ్నీ జట్టు సాధించడమే పెద్ద విషయం అయితే.. తొలిసారిగా సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో టీ20ల్లో ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం జేమ్స్ విన్స్ వల్లే సాధ్యమైంది. ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ సిడ్నీ సిక్సర్స్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అంతేకాదు 58 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

జేమ్స్ విన్స్ అద్భుత సెంచరీ..

జోష్ ఫిలిప్పితో కలిసి జేమ్స్ విన్స్ సిడ్నీ సిక్సర్ల జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 48 బంతుల్లో 83 పరుగులు జోడించారు. 23 బంతుల్లో 42 పరుగులు చేసి ఫిలిప్పి ఔట్ అయినప్పటికీ విన్స్ మరో ఎండ్‌లో గట్టిగా నిలబడ్డాడు. ఈ క్రమంలోనే 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి జట్టును గెలిపించాడు. చివర్లో జోర్డాన్ సిల్క్ 19 బంతుల్లో అజేయంగా 34 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తంగా 74 ఇన్నింగ్స్‌లు ఆడిన విన్స్ 1 సెంచరీ, 10 అర్ధ సెంచరీలతో 2088 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

బెన్ డకెట్ ఇన్నింగ్స్ వృథా..

మెల్‌బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ఆటగాడు 29 బంతుల్లో 68 పరుగులు బాదాడు. బెన్ డకెట్ తన ఇన్నింగ్స్‌లో వరుసగా 6 ఫోర్లు కొట్టడం విశేషం. ఈ క్రమంలో డకెట్ స్ట్రైక్ రేట్ 234.48గా ఉంది. మ్యాక్స్‌వెల్ కూడా 17 బంతుల్లో 32 పరుగులు చేసి రాణించాడు. వీరిద్దరి సాయంతో జట్టు 20 ఓవర్లలో 194 పరుగులు చేయగలిగింది. అయితే ఈ స్కోరు సిడ్నీ సిక్సర్లకు చాలా తక్కువగా అనిపించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. కాగా మెల్‌బోర్న్ స్టార్స్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం గమనార్హం.

ఇది చదవండి: 66 ఫోర్లు, 43 సిక్సర్లతో 815 పరుగులు.. బ్యాట్‌తో పూనకాలు తెప్పించేశారుగా.. ఆ ప్లేయర్లు ఎవరంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..