AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs AUS: కోహ్లీతో ఫైట్, 5 రోజుల బ్యాన్..! వీడెవడురా బాబూ.. మరో పాంటింగ్‌లా ఉన్నాడే

అతడికి అదే ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్.. ఎదురుగా అద్భుతమైన బౌలింగ్ లైనప్. అయినా బెదురు ఏం లేదు. జస్ప్రిత్ బుమ్రాను ఉతికి ఆరేశాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు.. కానీ 5 రోజుల బ్యాన్ పడింది

IND Vs AUS: కోహ్లీతో ఫైట్, 5 రోజుల బ్యాన్..! వీడెవడురా బాబూ.. మరో పాంటింగ్‌లా ఉన్నాడే
Sam Kontas
Ravi Kiran
|

Updated on: Dec 27, 2024 | 6:44 PM

Share

ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కాన్స్టాస్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. ఆస్ట్రేలియా అభిమానుల నుంచి క్రికెట్ విశ్లేషకుల వరకు అందరూ అతని గురించే చర్చించుకుంటున్నారు. భారత్‌తో అరంగేట్రం మ్యాచ్‌లో.. అదీనూ బుమ్రాను ఓ ఆట ఆడేసుకోవడంతో.. అతడి ఆటతీరు అందరిని ఆకట్టుకుంది. మెల్‌బోర్న్‌లో డిసెంబర్ 26వ తేదీ గురువారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు 65 బంతుల్లో 60 పరుగులు చేసి ఆస్ట్రేలియా అభిమానుల దృష్టిలో హీరో అయ్యాడు. కాగా, అతడిపై 5 రోజుల నిషేధం విధించిన సంగతి మీకు తెల్సా..!

ఇంతకీ ఆ నిషేధం ఏంటంటే.?

సామ్ కాన్స్టాస్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ 5 రోజుల బ్యాన్ విధించింది. అతడు తన ఇన్‌స్టా ఖాతాను 5 రోజుల పాటు వినియోగించలేడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అర్ధ సెంచరీ కొట్టి అవుటైన కాన్స్టాస్‌ను 7 ప్లస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేయగా.. పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. తాను బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశానని చెప్పాడు. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో 90 వేల మంది అభిమానుల సమక్షంలో భారత్‌పై ఫిఫ్టీ సాధించాడన్నాడు. మరి దీని వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది ఫాలోవర్లు పెరిగారన్న ప్రశ్నకు.? కాన్స్టాస్ స్పందిస్తూ.. తాను 5 రోజుల పాటు ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్‌లో ఉన్నట్లు తెలిపాడు.

నిషేధం కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించలేకపోతున్నట్లు కాన్స్టాస్ చెప్పాడు. తన ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య 50 వేలు దాటే అవకాశం ఉందని అంచనా వేశాడు. కట్ చేస్తే.. గతంలో అతడి ఫాలోవర్స్ సంఖ్య 24 వేలు ఉండగా.. ఇప్పుడు అది లక్షకుపైగా చేరింది. పెవిలియన్ చేరిన అనంతరం కాన్స్టాస్‌ డగ్ అవుట్‌లో అభిమానులకు ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇస్తూ ఎంజాయ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: 66 ఫోర్లు, 43 సిక్సర్లతో 815 పరుగులు.. బ్యాట్‌తో పూనకాలు తెప్పించేశారుగా.. ఆ ప్లేయర్లు ఎవరంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..