AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?

టెస్టులో చివరి 14 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ 11 సగటుతో 155 పరుగులు చేశాడు. ఇందులో రోహిత్ 9 సార్లు రెండంకెల స్కోరును కూడా చేరుకోలేకపోయాడు. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాలని పట్టుబట్టారు.

Rohit Sharma: రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?
ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో భారత జట్టు ఏడు మ్యాచ్‌లలో ఒకటి గెలిచింది. అలాగే, బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అంటే, రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 14 మ్యాచుల్లో 6 ఓడిపోయింది. ఈ ఓటమితో కెప్టెన్ రోహిత్ భారత టెస్టు చరిత్రలో చెత్త రికార్డుల్లో ఒకడిగా నిలిచాడు. అంటే ఒక్క ఏడాదిలోనే టీమిండియాకు అత్యధిక టెస్టు పరాజయాలు తెచ్చిపెట్టిన కెప్టెన్‌గా రోహిత్ శర్మకు చెత్త పేరు దక్కింది.
Velpula Bharath Rao
|

Updated on: Dec 27, 2024 | 3:39 PM

Share

ఈరోజు మెల్‌బోర్న్ టెస్టులో రోహిత్ శర్మ తన కెరీర్‌లో చెత్త ప్రదర్శన చేశాడు. ఇటీవలి కాలంలో హిట్ మ్యాన్ బ్యాటింగ్, కెప్టెన్సీ రెండూ చాలా దారుణంగా ఉన్నాయి. ఒకవైపు బ్యాట్‌ నుంచి పరుగులు రావడం లేదు. మరోవైపు రోహిత్ సారథ్యంలో టీమిండియా వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోంది. మెల్‌బోర్న్ టెస్టులో పూర్ కెప్టెన్సీ చేశాడు రోహిత్.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతోో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ఇక రిటైర్మెంట్  ప్రకటించడం మంచిదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతోంది. అయితే ఈ సిరీస్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఓ సంఘటనను ఆధారంగా చేసుకొని కొందరు నెటిజన్లు చెప్పుతున్నారు. ఇంతకీ ఆ సంఘటన ఏంటంటే?

రోహిత్ శర్మ పూర్ ప్రదర్శన నేపథ్యంలో నెటిజన్లు రిటైర్మెంట్ ప్రకటించాలని కోరుతున్నారు. అయితే మెల్‌బోర్న్ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు కాబట్టి రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొందరు కామెంట్లు పెడుతున్నారు. , 2014 ఆస్ట్రేలియా పర్యటనలో బాక్సింగ్ డే టెస్టులో స్మిత్ సెంచరీ సాధించినప్పుడు, భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్టు నుండి రిటైర్ అయ్యాడు. అప్పుడు రెండు టెస్టుల్లో ఓడిపోయిన తర్వాత ధోనీ కూడా మెల్బోర్న్ చేరుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత, అతను డిసెంబర్ 30న రిటైర్మెంట్ ప్రకటించాడు.

బాక్సింగ్ డే టెస్టులో భారత్‌పై స్మిత్ మరోసారి సెంచరీ సాధించాడు. తన కెప్టెన్సీలో రెండు టెస్టుల్లో ఓడిపోయిన రోహిత్ కూడా మెల్బోర్న్ చేరుకున్నాడు. అతని ప్రదర్శన చూస్తుంటే, ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడని భావిస్తున్నారు. అతను టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు.

రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో అతను 4 ఇన్నింగ్స్‌ల్లో 5.5 సగటుతో 22 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, టెస్టు చివరి 14 ఇన్నింగ్స్‌ల్లో అతను 11.07 సగటుతో 155 పరుగులు మాత్రమే చేశాడు. అతని బ్యాట్ నుండి కేవలం 1 అర్ధ సెంచరీ మాత్రమే వచ్చింది. ఈ 14 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 5 సార్లు డబుల్ ఫిగర్స్‌ను తాకగా, 10 పరుగుల వ్యవధిలో 9 సార్లు ఔట్ అయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి