Telangana: సెక్యూరిటీ ఇస్తామంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్
వరంగల్ ప్రజలకు ఘరానా దొంగల భయం పట్టుకుంది. నిర్మాణంలో ఉన్న భవనాలే వారి టార్గెట్. దొరికినకాడికి దొరికినట్టు దోచేస్తున్నారు. తాజాగా అదే తరహ ఘటన ఒకటి వరంగల్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? లేట్ ఎందుకు..
వరంగల్‌లో ఘరానా దొంగలు హల్చల్ చేస్తున్నారు. పెద్దమ్మగడ్డ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అపహరించారు. తమను ఇంటి యాజమాని పంపాడని సెక్యూరిటీ సిబ్బందిని నమ్మించి.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డు కాగా.. వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు ఇంటి యజమాని. కాగా, నిర్మాణంలో ఉన్న ఇళ్లలో ఇలా చోరీలకు పాల్పడి ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ ముఠా అమ్ముకుంటోందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
వైరల్ వీడియోలు
Latest Videos