Watch: ఇక వాళ్లంతా 125 - 130 ఏళ్ళు.. ఈజీగా బతుకుతారా.?

Watch: ఇక వాళ్లంతా 125 – 130 ఏళ్ళు.. ఈజీగా బతుకుతారా.?

Anil kumar poka

|

Updated on: Dec 30, 2024 | 11:59 AM

బ్రెజిల్ కు చెందిన జోవో మారిన్హో నెటో ఓ మూడు రోజుల కిందట ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కారు. దీనికి కారణం... 112 ఏళ్ల జోవో నెటో ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యధిక వయసున్న వ్యక్తిగా రికార్డులెక్కారు. ఈ విషయాన్ని ఆయనకు.. సహాయకురాలు చెప్పినప్పుడు ‘‘నేను చాలా అందగాడిని కూడా’’ అంటూ జోవో చమత్కరించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులోనూ జోవో పేరు చేరింది.

బ్రిటన్‌కు చెందిన 112 ఏళ్ల జాన్ టిన్నిస్ ఉడ్ 2024 నవంబర్ 25న చనిపోవడంతో జోవో నెటో ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డ్ నమోదైంది. టొమికో ఇటూక ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అతి పెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందారు . ఆమె వయసు 116 ఏళ్లు. ఆమె 2024 ఆగస్టులో అతి పెద్ద వయోధికురాలిగా రికార్డులకెక్కారు. ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద వయస్కులుగా గుర్తింపు పొందిన స్త్రీ పురుషులిద్దరూ వందేళ్లకు పైబడినవారే. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణాలేంటి? అంటే అందరి ఆయుష్షూ పెరుగుతోందా?

వందేళ్లు దాటిన వారి జీవన రహస్యం ఏంటి?
చిన్నవారు పెద్దలకు నమస్కారం పెట్టినప్పుడు.. నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలి అని దీవిస్తారు. ఇప్పుడు ఆ దీవెనలో నెంబర్ ను మార్చుకోవాలా? ఎందుకంటే నూరేళ్ల కన్నా ఎక్కువ కాలం చాలామంది బతుకుతున్నారు. వందేళ్లు బతకడమే కష్టం అయితే, వందేళ్ల తర్వాత కూడా జీవించడం ఇంకా కష్టం. అమెరికాలో ఐదు లక్షల్లో ఒకరు మాత్రమే వందేళ్లు దాటి 110 ఏళ్ల వరకు జీవించారని బోస్టన్ యూనివర్సిటీ దీర్ఘకాల అధ్యయనం అంచనా వేసింది. వందేళ్లకు పైగా జీవించిన అమెరికన్ల సంఖ్య 2010 వరకు 50 వేలకు పైగా ఉండగా, 2020 నాటికి 80 వేలకు చేరిందని అమెరికా జనాభా లెక్కలు చెబుతున్నాయి. దీంతో వందేళ్లకు పైబడి జీవించిన వారు సహజంగానే మనుషుల వయసుని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నారు.”వృద్ధాప్యంలో అనేక మందికి వచ్చే సమస్యలను వారు అధిగమిస్తున్నారు..

వందేళ్లకు పైబడి జీవిస్తున్నవారు తమ వయసుకు తగ్గట్లుగా ఆరోగ్యంగా ఉంటున్నారు. నెటోకు దృష్టి సంబంధిత సమస్యలు తప్ప ఇతర అనారోగ్య సమస్యలేవీ లేవు ..ఆయనకు ఎలాంటి ఔషధాలు అవసరం లేదు. ఆయనకు తీవ్రమైన వ్యాధులున్న చరిత్ర కూడా లేదు. ఆయన వయసు 112 ఏళ్లు. నెటో ఎలాంటి సమస్యలు లేకుండా జీవిస్తున్నారని, ఆయనకు ఆల్కహాల్ అలవాటు కూడా లేదంట . వందేళ్లకు పైబడి జీవించిన మిగతా వారు కూడా ఇంకా మెరుగైన జీవితం గడిపారు. ఫ్రాన్స్‌లో 122 ఏళ్లు జీవించిన జీన్ కాల్మెంట్ 1997లో చనిపోయారు. 120 ఏళ్లు పైబడి జీవించిన వ్యక్తిగా ఆయన ఆధికారికంగా గుర్తింపు పొందారు. ఆయన ధూమపానం చేసేవారు. చాక్లెట్లు కూడా విపరీతంగా తినేవారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.