AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా? టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్

అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో సికింద్రా బాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Allu Arjun: అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా? టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్
Allu Arjun
Basha Shek
|

Updated on: Dec 30, 2024 | 7:30 PM

Share

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడం వల్లే రేవతి చనిపోయిందని ఆయనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అయితే బన్నీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ పై సోషల్ మీడియా వేదికగా బాగా ట్రోలింగ్ నడుస్తోంది. కొందరు నెటిజన్లు బన్నీ ప్రవర్తనా తీరును తప్పుపడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. వీటికి అల్లు అర్జున్ అభిమానులు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు అల్లు అర్జున్ కు మద్దతుగా ఆమె మాట్లాడుతోన్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

‘గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్‌కు ఎంత యాటిట్యూడ్ .. ఎంత పొగరు. పైకి, కిందకు, పక్కకు చూశాడు. ఆ కళ్లల్లో ఎంత యాటిట్యూడ్ ఉంది? ఎంత బలుపు చూపిస్తున్నాడు? అని ఒకటే పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో కాదురా డైమండ్ స్పూన్‌తో పుట్టాడు. అతనికి యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటి? ఏమీ లేని మీకే బలుపు ఉంటే.. అతన్ని కామెంట్ చేస్తున్నావ్ నీ దగ్గర ఏముంది? నువ్వంత యాటిట్యూడ్ చూపించడానికి ఎదుటివాళ్ళని జడ్జ్ చేయడానికి నీకేం హక్కు ఉంది? 10 ఏళ్ల క్రితం అనుకుంట రామ్ చరణ్‌ది కూడా ఓ ఇంటర్వ్యూ చూశాను.. మీకెందుకు ఇంత యాటిట్యూడ్ అనడిగితే ఎందుకుండ కూడదని ఆన్సర్ అన్నాడు. నిజమే కదా.. ఎందుకు ఉండకూడదు.’

ఇవి కూడా చదవండి

‘మెగాస్టార్ చిరంజీవి కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు. అలాగే అల్లు అరవింద్ కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు. ఏ మీరు చూపిస్తే యాటిట్యూడ్ కానిది అల్లు అర్జున్ చేస్తే ఎలా తప్పు అవుతుంది. అయినా ఇప్పుడు ప్రతిదీ స్లో మోషన్‌లో పెట్టి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. దించుతాం మేము బలుపు దించుతాం అంటూ పోస్టులు పెడుతున్నారు. మీకు ఏం చేతకాదు. అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఇలా అంటారు. మళ్లీ మీ ఫేవరెట్ హీరో మాత్రం మీకు దేవుడై పోతాడు.. అదేందో మరి’ అంటూ బన్నీని ట్రోల్ చేస్తున్న వారిని కడిగిపారేసింది మాధవీ లత.

మాధవీలత వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..