Rohit Sharma: సైలెంటుగా రోహిత్ కు రాడ్ దింపిన ఆశ్! ఏమన్నాడో చూడండి

మెల్‌బోర్న్‌లో భారత జట్టు పోరాటంలో రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. రోహిత్ శర్మ తక్కువ స్కోరు చేస్తూ ఔటవ్వడం, రాహుల్, కోహ్లీ వికెట్లు త్వరగా కోల్పోవడం జట్టు పరిస్థితిని బలహీనంగా చేసింది. అశ్విన్ ట్వీట్లు నాయకత్వం, ప్రదర్శనపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌ను పటిష్టం చేసుకుంది.

Rohit Sharma: సైలెంటుగా రోహిత్ కు రాడ్ దింపిన ఆశ్! ఏమన్నాడో చూడండి
Rohit And Ashiwn
Follow us
Narsimha

|

Updated on: Dec 30, 2024 | 7:17 PM

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్ట్ 5వ రోజు భారత జట్టు కష్టకాలంలో రవిచంద్రన్ అశ్విన్ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టించాయి. కెప్టెన్ రోహిత్ శర్మ డిఫెన్సివ్వె గా ఆడుతూ 40 బంతుల్లో కేవలం 9 పరుగులు చేసి ఔటయ్యారు. తరువాత KL రాహుల్, విరాట్ కోహ్లీలు కూడా వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. జట్టు ఒత్తిడిలో ఉన్న వేళ, అశ్విన్ తన ట్వీట్స్‌తో జట్టు ప్రదర్శనపై విమర్శనాత్మక సందేశాల్ని పంపారు.

“మంచి నాయకులు కఠిన పరిస్థితుల్లోనే ప్రదర్శన చూపుతారు” అని ట్వీట్ చేసిన అశ్విన్, ఆ వెంటనే తన వ్యాఖ్యను “ఈ ట్వీట్ ఫ్యాన్ క్లబ్‌లను కలిగి ఉన్న వ్యక్తుల కోసం కాదు” అంటూ రీపోస్ట్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది.

భారత జట్టు తర్వాత యశస్వి జైస్వాల్-రిషభ్ పంత్ కలిసి మంచి పార్ట్‌నర్‌షిప్ అందించినప్పటికీ, మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుని భారత జట్టును వెనక్కి నెట్టింది. పాట్ కమ్మిన్స్ రిస్క్ చేసి ట్రావిస్ హెడ్‌ను బౌలింగ్‌కు తీసుకురావడంతో పంత్ ఔటయ్యారు. దీంతో ఒక్కసారిగా భారత జట్టు కష్టాల్లో పడింది. చివరికి MCGలో ఆస్ట్రేలియా ఘన విజయంతో సిరీస్‌ను 2-1 తేడాతో పటిష్టంగా నిలుపుకుంది.