Viral: బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతోందా.. ఎడారిని ముంచెత్తిన నీరు.. మీరూ చూశారా.?
రాజస్థాన్‌లో ఓ వింత చోటు చేసుకుంది. ఎడారిలో నీరు వరదలై పారుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎడారి కూడా నీట మునిగిందా అంటూ అంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసా.! ఈ స్టోరీ తెలుసుకుందామా..
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని మెహన్‌గఢ్‌లో ఓ వ్యక్తి తన స్థలంలో బోరుబావి వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. యంత్రాలు తీసుకువచ్చి బోరుబావి తీస్తుండగా.. ఒక్కసారిగా గంగపైకి పొంగి వచ్చింది. భారీ ఉధృతితో నీరు పైకి ఉబికిరావడంతో పెద్ద గుంత ఏర్పడి అందులో బోరుబావి యంత్రం పడిపోయింది. అతిపెద్ద మోటారు పైపు పగిలితే నీరు ఎంతో పైకి ఎగిసిపడినట్లు.. ఈ నీరు అలా భూమి పైకి వస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్ అయ్యారు.
आज रेगिस्तान भी हुआ जलमग्न… राजस्थान में जैसलमेर जिले के मोहनगढ़ कस्बे में विहिप कार्यकर्ता विक्रमसिंह जी के खेत में बोरवेल खोदते समय धरती से फूटा जलधारा का प्रवाह.. स्मरण रहे कि प्राचीन विलुप्त मां सरस्वती नदी का प्रवाह मार्ग रहा है जैसलमेर का मरुस्थल।#जलमग्न_रेगिस्तान… pic.twitter.com/UOSoGND5EJ
ఇవి కూడా చదవండి— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) December 28, 2024
దీనిని వీహెచ్‌పీ నేత వినోద్ బన్సల్ ట్వీట్ చేశారు. ‘నేడు ఎడారి కూడా నీట మునిగింది’ అంటూ ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వీహెచ్‌పీ కార్యకర్త పొలంలో బోరుబావి వేస్తుండగా నీటి ప్రవాహం పైకి వచ్చిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జైసల్మేర్ ఎడారిలో అంతరించిపోయిన పురాతన తల్లి సర్వసతి నదియే ఈ ప్రవాహ ఉధృతికి కారణం అంటూ వినోద్ బన్సల్ తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.
ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి