Viral: హాఫ్ బాటిల్ రా విస్కీ దించకుండా తాగాలని పందెం.. బరిలోకి యువకుడు.. కట్ చేస్తే..
పైత్యం పీక్స్‌కి వెళ్లింది. ఛాలెంజ్ పేరుతో మృత్యువుతో గేమ్ ఆడాడు ఓ యువకుడు. ఫలితం అనుభవించాల్సి వచ్చింది. మాములుగా లిక్కర్ ఒక 45 ML గ్లాసులో వేసి.. అందులో వాటర్, సోడా వంటివి కలుపుకుని తాగుతారు. కానీ ఇతగాడు ఏకంగా హాఫ్ బాటిల్ విస్కీ.. దించకుండా గటగటా తాగాడు.. ఆ తర్వాత....
అతని పేరు థానకర్న్ కాంతి.. థాయిలాండ్‌కు చెందినవాడు. వయస్సు 21. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్. నెటిజన్స్ అతడిని “బ్యాంక్ లీసెస్టర్” అని పిలుస్తారు. కింద నుంచి ఎదిగాడు. కానీ ఓ లిక్కర్ ఛాలెంజ్ తీసుకుని మృత్యువాతపడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. 350 ml విస్కీ అంటే ఆల్మోస్ట్ హాఫ్ బాటిల్ కంటే ఎక్కువ రా లిక్కర్.. దించకుండా తాగితే.. 700 బ్రిటీష్ పౌండ్లు ఇస్తామన్నది పందెం. గతంలో ఇలాంటి ఛాలెంజ్‌లు ఎన్నో చేసిన థానకర్న్ బరిలోకి దిగాడు. పందెం ప్రకారం అంత మద్యం దించకుండా తాగేశాడు. ఈ సంఘటన క్రిస్మస్ రాత్రి పార్టీ సందర్భంగా జరిగింది. అక్కడ ఇతరులు అతనిని ప్రోత్సహించడం కూడా వీడియోలో రికార్డు అయింది. అయితే, మద్యం సేవించిన కొద్దిసేపటికే వాంతులు చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. అంతకముందు ఆయనను ఉత్సాహపరిచిన తొటి వ్యక్తులు.. పరిస్థితి త్వరగా క్షీణించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
థానకర్న్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అతను డిసెంబర్ 26 తెల్లవారుజామున మరణించినట్లు ప్రకటించారు. అధికారిక శవపరీక్ష పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అతని మరణానికి అధిక మద్యపానం కారణంగా గుండె ఆగిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
బ్యాంకాక్‌లోని మురికివాడలో పెరిగిన థానకర్న్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అతను కేవలం రెండు నెలల వయస్సులో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు విడిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగాడు, అతను తన ఏడేళ్ల వయస్సులో తన కుటుంబాన్ని పోషించడంలో సహాయంగా ఒక మార్కెట్‌లో పూల దండలు అమ్మడం ప్రారంభించాడు. అతను తరువాత రాప్ వీడియోలను పోస్ట్ చేయడం. వివిధ ఛాలెంజ్‌లలో పాల్గొనడం ద్వారా సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించాడు. చివరకు ఈ విధంగా దుర్మరణం చెందాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీడియో దిగువన చూడండి…
Influencer hace un Chumel Torres y chupa faros ‼️
🇹🇭 Tailandia: Fallece el influencer Thanakarn Kanthee. Thanakarn "Bank Leicester" Kanthee, un joven influencer tailandés, murió tras aceptar un peligroso desafío que implicaba el consumo excesivo de alcohol. pic.twitter.com/qfcKwecAJg
— Fernando (Chairo de alcurnia) 🇷🇺 (@FernandovichG) December 30, 2024
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి