Viral: అయ్యో.. విమానం టైరులో డెడ్‌బాడీ.! సడన్ ల్యాండింగ్..
విమానం టైరులో ఓ డెడ్‌బాడీ కలకలం రేపింది. హవాయి ద్వీపంలోని కహులుయీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో అధికారులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. అమెరికాలో షికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం వచ్చింది. అయితే ఈ మృతదేహం దానిలోకి ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
విమానం బయటి నుంచి మాత్రమే ఎవరైనా వీల్ వెల్‌లోకి వెళ్లగలరు. అయితే, ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరాడనేది తెలియాల్సి ఉంది.. అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి వెల్లడించారు. అలాగే మృతుడి వివరాలను ఆరా తీస్తున్నారు. చట్టవిరుద్ధంగా ప్రయాణించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఈ తరహా రిస్క్ చేస్తుంటారని తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారు సజీవంగా బయటపడే అవకాశాలు చాలా తక్కువ. వీల్ వెల్ ఇరుకుగా ఉండటంతో ల్యాండింగ్ గేర్ వెనక్కి తిప్పినప్పుడు వీరు మరణించడానికి ఆస్కారం ఉంటుంది. గత సంవత్సరం ఫ్రాన్స్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే ఆ వ్యక్తి అనూహ్యంగా బతికిబయటపడ్డాడు. విమానంలోని అండర్ క్యారేజ్ బేలో ప్రయాణించిన ఆ వ్యక్తిని విమానం సిబ్బంది సజీవంగా గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.