PV Sindhu: మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.. వీడియో.

PV Sindhu: మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Dec 28, 2024 | 7:43 PM

భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన మిత్రుడు, పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. అతికొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన తమ పెళ్లి ఫొటోలను సింధు షేర్‌ చేస్తూ హార్ట్‌ ఎమోజీని జత చేసారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింధు సాయితో తన ప్రేమ గురించి వివరించారు.

సాయి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్‌ అనీ, అయినా తమ మధ్య ప్రేమ రెండేళ్ల క్రితమే మొదలైందని తెలిపారు. అదికూడా ఓ విమాన ప్రయాణంలో ఉండగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలిపారు. 2022 అక్టోబరులో మేమిద్దరం కలిసి ఓ విమానంలో ప్రయాణించాం. ఆ తర్వాత అంతా మారిపోయింది. ఆ జర్నీ మమ్మల్ని దగ్గర చేసింది. అదంతా లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌లా అనిపించింది. ఆ క్షణం నుంచి మా ప్రేమ ప్రయాణం మొదలైంది అని సింధు తెలిపారు. ఈసందర్భంగా తన నిశ్చితార్థం గురించి కూడా వెల్లడించారు. చాలా తక్కువమంది సమక్షంలో మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. మా జీవితంలో ముఖ్యమైన ఘట్టాన్ని మేం గ్రాండ్‌గా చేసుకోవాలనుకోలేదు. మేం నమ్మిన వ్యక్తుల మధ్య సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నాం. అది చాలా భావోద్వేగభరిత క్షణం. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని సింధు చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.