AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తండ్రి జ్ఞాపకాలను మరవలేకపోయారు.. ఏకంగా పెళ్లి మండపంలోకి తీసుకువచ్చారు..!

చనిపోయిన తండ్రి జ్ఞాపకాలను మరవలేకపోయారు. కొత్తగూడెంకు చెందిన పెడకం బాలరాజు కుమారుడు తన తండ్రిపై మమకారంతో.. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక కళాకారులతో తండ్రి ప్రతిమను చేయించారు. తన సోదరి వివాహ వేడుకలో తండ్రి విగ్రహాన్ని తీసుకువచ్చి ఏర్పాటు చేశారు. తండ్రి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలనే భావనతో విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్లు బాలరాజు పిల్లలు తెలిపారు.

Telangana: తండ్రి జ్ఞాపకాలను మరవలేకపోయారు.. ఏకంగా పెళ్లి మండపంలోకి తీసుకువచ్చారు..!
Marriage Reception
N Narayana Rao
| Edited By: |

Updated on: Dec 29, 2024 | 8:55 AM

Share

ఇంట్లో కుటుంబ సభ్యులు మరణిస్తే, వారి జ్ఞాపకాలను మరవలేక పోటో రూపంలో ఇంట్లో పెట్టుకుంటాం. వారికి నివాళి అర్పిస్తూ గుర్తు చేసుకుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తన తండ్రిని మరిచి పోలేకపోయారు పిల్లలు. ఏకంగా ఆయన ప్రతిమను చేయించుకుని ఇంట్లో ఏర్పాటు చేయించుకున్నారు.

కొత్తగూడెం సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్(ఐటీ)గా విధులు నిర్వహించిన పెడకం బాలరాజు అనారోగ్యంతో ఐదు సంవత్సరాల క్రితం మరణించారు. వీరికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన మృతితో కుమార్తె స్నేహకు సింగరేణిలో ఉద్యోగ అవకాశం కల్పించారు. వారి కుమార్తె స్నేహ వివాహం సింగరేణి హెడ్ ఆఫీస్‌లో అధికారిగా పని చేస్తున్న తంబళ్ల అవినాష్‌తో జరిగింది. కొత్తగూడెం లో వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వివాహ రిసెప్షన్ సందర్భంగా స్నేహ తమ్ముడు పెడకం బాలరాజు కుమారుడు తన తండ్రిపై మమకారంతో.. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముంబాయిలో ఐదు లక్షల రూపాయలతో వీల్ చైర్ లో కూర్చొన్న రూపంలో తండ్రి ప్రతిమను తయారు చేయించారు. అతను బ్రతికి ఉన్నట్టే.. స్టేజీపై కూర్చోబెట్టి.. తండ్రి విగ్రహంతో పోటోలు దిగారు. అందరూ సింగరేణి సంస్థ ఉద్యోగులు కావడంతో బాలరాజు తమ మధ్య ప్రత్యక్షంగా లేకపోయినా విగ్రహ రూపంలో చూసుకుని, పెళ్లి మండపంలో కంటతడి పెట్టారు.

నవ వధువు స్నేహ, స్నేహ తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. మరణించిన తండ్రిపై మమకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కుమారుడికి అభినందనలు తెలిపారు. తండ్రి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలనే భావనతో విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమ, మమకారం అంటే ఇదే కదా..!

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి