Mohammed Shami: BGT ఎలాగూ పాయె! కనీసం దానికైనా వస్తాడంటారా మాస్టరూ? అభిమానుల్లో కొత్త టెన్షన్
మహ్మద్ షమీ గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. కోలుకున్న తర్వాత NCAలో సాధన చేస్తూ జాతీయ జట్టులోకి రాబోమనన్న సంకేతాలు ఇస్తున్నాడు. దేశవాళీ టోర్నమెంట్లలో తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడం ద్వారా అభిమానుల్లో నమ్మకం పెంచుతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో షమీ కీలక పాత్ర పోషిస్తాడా అనేది క్రికెట్ ప్రేమికుల ఉత్కంఠగా మారింది.
ఇటీవల భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీని చూడని అభిమానులు, అతని గాయం నుంచి కోలుకొని మళ్లీ మైదానంలో అడుగుపెడతాడా అనే ఉత్కంఠలో ఉన్నారు. వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసిన షమీ, ప్రపంచకప్ తర్వాత గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకుని NCAలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడైన ప్రదర్శనతో తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
కానీ అతను పూర్తి స్థాయిలో గాయం నుండి కోలుకోపోవడంతో ఆస్ట్రేలియాతో తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. దీంతో క్రికెట్ అభిమానులు మరింత నిరాశ చెందారు.
అయితే వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి షమీ పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉంటాడా అనే ప్రశ్నకు ఇంకా స్పష్టత లేదు. షమీ ప్రస్తుతం తన గాయానికి తగిన శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నప్పటికీ, జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి సాధన చేస్తూనే ఉన్నాడు.