IND Vs AUS: కాటేరమ్మ కొడుకును కనికరించని ఐసీసీ.. అవార్డు రేసులో భారత ప్లేయర్స్‌కి నో ఎంట్రీ.!
ఆస్ట్రేలియా గడ్డపై అదిరిపోయే సెంచరీ సాధించాడు నితీష్ కుమార్ రెడ్డి. అటు యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్ కూడా సత్తా చాటుతున్నారు. వీరిలో ఒకరైనా ఈ ఏడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకుంటున్నారని భావించినా.. చివరికి నిరాశ తప్పలేదు.
మరో రెండు రోజుల్లో 2024 సంవత్సరం ముగియబోతోంది. క్రికెట్ యాక్షన్‌కి కూడా ఈ ఏడాది తెరపడుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ఆటగాళ్లకు ఇచ్చే ఐసీసీ అవార్డుల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ICC కూడా మొదటి కేటగిరీలో పోటీదారుల పేర్లను ప్రకటించింది. ఇందులో భారత మెన్స్ టీం నుంచి ఒక్క ఆటగాడి పేరు కూడా లేదు. నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇలా ఎందరో ఎమర్జింగ్ ప్లేయర్స్ ఉన్నా.. ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన పేరు మాత్రం మహిళల విభాగం నుంచి వచ్చింది. ఆమె మరెవరో కాదు టీమిండియా విమెన్ క్రికెటర్ శ్రేయాంక పాటిల్
డిసెంబర్ 28 శనివారం, ICC ఈ కేటగిరీ అభ్యర్థులను ప్రకటించింది. పురుషుల షార్ట్‌లిస్ట్‌లో భారత ఆటగాళ్లెవరూ చోటు దక్కించుకోలేదు. దీనికి యశస్వి జైస్వాల్ లేదా అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాడిని ఎంపిక చేయవచ్చని భావించినా అది జరగలేదు. గతేడాది షార్ట్ లిస్ట్‌లో జైస్వాల్ ఉన్నప్పటికీ.. అప్పుడు అవార్డు దక్కించుకోలేకపోయాడు. అదే సమయంలో మెల్‌బోర్న్ టెస్టులో అద్భుత సెంచరీ సాధించిన ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా ఎంపిక చేయలేదు.
ఐసీసీ ఈ జాబితాలో 4 మంది ఆటగాళ్లను చేర్చింది. ఇందులో పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్ నుంచి ఒక్కొక్క ఆటగాడు ఉన్నారు. 9 ODI మ్యాచ్‌ల్లో 64 సగటుతో 515 పరుగులు చేసిన పాకిస్తాన్ నుంచి యువ ఓపెనర్ సయీమ్ అయూబ్.. శ్రీలంక నుంచి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కమిందు మెండిస్ ఈ రేసులో ఉన్నారు. మెండిస్ ఈ ఏడాది 32 మ్యాచ్‌ల్లో 50 సగటుతో 1451 పరుగులు చేశాడు. ఈ ఏడాది బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా వెన్ను విరిచిన వెస్టిండీస్ యువ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ కూడా ఈ ఏడాది 8 టెస్టుల్లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేసిన పేసర్ గస్ అట్కిన్సన్ కూడా 11 టెస్టుల్లో 52 వికెట్లు పడగొట్టి బలమైన పోటీదారుగా ఉన్నాడు.
మహిళల రేసులో శ్రేయాంక చేరింది..
భారత యువ స్పిన్ ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ మహిళల జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన శ్రేయాంకకు ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. ఆమె 13 T20 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీయగా, 2 ODIలలో 4 వికెట్లు కూడా పడగొట్టింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కేవలం 14 పరుగులకే 2 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అవార్డు కోసం ఐర్లాండ్‌కు చెందిన ఫ్రెయా సార్జెంట్, దక్షిణాఫ్రికాకు చెందిన అన్నే డిర్క్‌సెన్, స్కాట్లాండ్‌కు చెందిన సస్కియా హార్లీలతో శ్రేయాంక పోటీ పడుతోంది.
ఇది చదవండి: 66 ఫోర్లు, 43 సిక్సర్లతో 815 పరుగులు.. బ్యాట్‌తో పూనకాలు తెప్పించేశారుగా.. ఆ ప్లేయర్లు ఎవరంటే.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..