Hyderabad: నగర వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఫ్లై ఓవర్
సుదీర్ఘ జాప్యం తర్వాత, 1.5 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. కొన్ని చిన్న పనులు ఉండటంతో.. వాటిలో కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఈ ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ రద్దీ మెరుగుపడుతుందని, వరంగల్ హైవే నుంచి నగరంలోకి ప్రవేశించే ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గుతుందని భావిస్తున్నారు.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు 1.5 కిలోమీటర్ల పొడవైన అంబర్‌పేట్ ఫ్లైఓవర్ సిటీ వాసులకు అందుబాటులోకి రానుంది. ఫ్లైఓవర్‌ను త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించేందుకు వీలుగా మిగిలిన చిన్నచిన్న పనులను జిహెచ్‌ఎంసి వేగవంతం చేసింది. నాలుగు లేన్ల ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. వరంగల్ హైవే నుంచి సిటీలోకి వచ్చే వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.
ఈ ఫ్లై ఓవర్ స్థల సేకరణ కోసం 300 కోట్లు ఖర్చు అవ్వగా.. మొత్తం నిర్మాణ ఖర్చు 450 కోట్లు వరకు వచ్చింది. ఇది గోల్నాక దగ్గర ప్రారంభమై MCH క్వార్టర్స్ సమీపంలోని పూర్ణోదయ కాలనీలో ముగుస్తుంది. ఈ అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌కు 2018లో అడుగులు పడ్డాయి. అయితే, పనులు 2021లో ప్రారంభమయ్యాయి. 2023లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, నిర్ణీత సమయానికి నిర్మాణం పూర్తవ్వలేదు. కొత్త ఏడాది జనవరి నెలలోనే ఈ ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి