నితీశ్ రెడ్డికి ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరో తెల్సా.? అసలు ఊహించలేరు

28 December 2024

Ravi Kiran

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో అదిరిపోయే సెంచరీ సాధించి.. క్రికెట్ ప్రపంచంలో ఓ సెన్సేషన్‌గా మారాడు నితీష్ కుమార్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో పుట్టి పెరిగిన నితీష్ రెడ్డి.. తన 5వ ఏట నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. కొడుకు క్రికెట్ కోసం అతడి తండ్రి తన ఉద్యోగానికి త్యాగం చేశాడు.

అండర్-12, అండర్-14 గ్రూప్ మ్యాచ్‌ల సమయంలో మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ నితీష్ రెడ్డిని గుర్తించి.. ట్రైనింగ్ నిమిత్తం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు పంపించాడు.

2023లో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీష్ కుమార్ రెడ్డిని రూ. 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఇక 2024లో ఆ ఫ్రాంచైజీకి స్టాండ్ అవుట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు నితీష్ రెడ్డి. 

బంగ్లాదేశ్‌తో టీ20లకు ఎంపికైన నితీష్ రెడ్డి.. ఆ తర్వాత ఆల్‌రౌండర్ స్థానంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ద్వారా టెస్టుల్లోకి టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. 

నితీష్ కుమార్ రెడ్డి ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెల్సా.. అతడు మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాను మహేష్ బాబుకు వీరాభిమానినని చాలాసార్లు చెప్పాడు 

తన నాన్న కృష్ణ అభిమాని అని.. పోకిరి సినిమా నుంచి తాను మహేష్ బాబును ఫాలో అవుతున్నానని చెప్పాడు నితీష్ రెడ్డి. మహేష్ సినిమాలు తనకెంతో స్పూర్తిని ఇస్తాయని కూడా చెప్పాడు నితీష్ కుమార్ రెడ్డి. 

మెల్‌బోర్న్‌లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పుష్ప స్టైల్ సెలబ్రేషన్ చేస్తే.. సెంచరీ చేరుకున్నాక సలార్ స్టైల్ సెలబ్రేషన్ చేసి.. గ్రౌండ్‌లో వైల్డ్ ఫైర్ పూనకాలు తెప్పించాడు నితీష్ రెడ్డి.