IND vs AUS: ముగిసిన నాలుగో రోజు.. చివర్లో తేలిపోయిన బౌలర్లు.. 300లు దాటిన ఆస్ట్రేలియా ఆధిక్యం..
India vs Australia, 4th Test Day 4: మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 228 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యం 333 పరుగులు. నాథన్ లియాన్ 41, స్కాట్ బోలాండ్ 10 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి మధ్య 55 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. చివర్లో భారత బౌలర్లు తడబడ్డారు. అలాగే, ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా తోడవ్వడంతో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయలేకపోయింది. దీంతో ఐదో రోజు మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
India vs Australia, 4th Test Day 4: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో నాలుగో రోజు ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌పై ఆస్ట్రేలియా 300 పరుగులకుపైగా ఆధిక్యం సాధించింది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 228 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యం 333 పరుగులు. నాథన్ లియాన్ 41, స్కాట్ బోలాండ్ 10 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి మధ్య 55 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. చివర్లో భారత బౌలర్లు తడబడ్డారు. అలాగే, ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా తోడవ్వడంతో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయలేకపోయింది. దీంతో ఐదో రోజు మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
పాట్ కమిన్స్ 41 పరుగులు, మిచెల్ స్టార్క్ 5 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 70 పరుగులు, స్టీవ్ స్మిత్ 13 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 21 పరుగులు చేసి పెవిలియన్‌కు పంపాడు. జస్ప్రీత్ బుమ్రా అలెక్స్ కారీ (2 పరుగులు), మిచెల్ మార్ష్ (0), ట్రావిస్ హెడ్ (1 పరుగు), సామ్ కాన్స్టాస్ (8 పరుగులు) వికెట్లు తీశారు. టెస్టుల్లో 200కు పైగా వికెట్లు పడగొట్టి రికార్డ్ లిఖించాడు.
ఆదివారం 358 పరుగుల ముందు ఆడడం ప్రారంభించిన భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. 114 పరుగుల వద్ద నితీష్ రెడ్డి ఔటయ్యాడు. కాగా మహ్మద్ సిరాజ్ 4 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. ఇక్కడ ఆస్ట్రేలియా 105 పరుగుల ఆధిక్యంలో ఉంది. పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్ తలో 3 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది.
That’s Stumps on Day 4
Australia reach 228/9 and lead by 333 runs
Updates ▶️ https://t.co/njfhCncRdL#TeamIndia | #AUSvIND pic.twitter.com/Gw8NbCljL7
— BCCI (@BCCI) December 29, 2024
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..