IND vs AUS: సెంచరీ హీరో ఔట్.. 369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
Australia vs India, 4th Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో నాలుగో రోజు భారత జట్టు 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 105 పరుగులకు చేరింది. 189 బంతుల్లో 114 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. నిన్నటి స్కోర్‌కు కేవలం 11 పరుగులు మాత్రమే జోడించి భారత జట్టు ఆలౌట్ అయింది.
Australia vs India, 4th Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 369 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం 105 పరుగులుగా నిలిచింది. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో నాలుగో రోజు భారత్ 358 పరుగులతో ఆడడం ప్రారంభించి మొత్తం స్కోరుకు 11 పరుగులు జోడించింది. 189 బంతుల్లో 114 పరుగులు చేసి నితీష్ రెడ్డి ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ 15 బంతుల్లో 4 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. ఇక్కడ ఆస్ట్రేలియా 105 పరుగుల ఆధిక్యంలో ఉంది. పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్ తలో 3 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది.
ప్రస్తుతం 5 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్ డ్రా అయింది.
ఇరు జట్లు…
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.