TV9 Telugu
28 December 2024
ఆస్ట్రేలియా టూర్‌లో నితీష్ కుమార్ రెడ్డి టీమ్ ఇండియాకు కొత్త ఆవిష్కరణగా నిరూపితమయ్యాడు. ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు ఎంతో కీలకంగా మారాడు.
ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లో టెస్టుకు నేరుగా అవకాశం దక్కించుకున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు 200కి పైగా పరుగులు చేశాడు. ఇది కాకుండా, అతను బంతితో కూడా మంచి సహకారం అందించాడు.
నితీష్ కుమార్ రెడ్డిని టీమ్ ఇండియాకు తీసుకురావడంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పాత్ర చాలా కీలకం.
ఐపీఎల్ 2023 వేలంలో నితీష్ కుమార్ రెడ్డిని 20 లక్షల రూపాయలకు కావ్య మారన్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అతని కెరీర్‌లో పెద్ద మలుపు తిరిగింది.
ఐపీఎల్ 2023లో నితీష్ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024లో సక్సెస్ అయ్యాడు. 13 మ్యాచుల్లో 303 పరుగులు చేసి 3 వికెట్లు కూడా తీశాడు.
ఐపీఎల్ 2024లో తన బలమైన ప్రదర్శన తర్వాత నితీష్ రెడ్డి టీమ్ ఇండియాలోకి ప్రవేశించాడు. ఇప్పుడు మెల్లగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు.
ఐపీఎల్ 2025 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా నితీష్ రెడ్డిని అట్టిపెట్టుకుంది. ఇందుకోసం కావ్య మారన్ రూ.6 కోట్లు వెచ్చించింది.