ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని ఆనాడే ప్రభుత్వానికి సూచించిన పార్లమెంటరీ కమిటీ
దేశంలో సెకండ్ కోవిడ్ వేవ్ తలెత్తడానికి కొన్ని నెలల ముందే ...గత ఏడాది నవంబరులో పార్లమెంటరీ పానెల్ ఒకటి ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని...
దేశంలో సెకండ్ కోవిడ్ వేవ్ తలెత్తడానికి కొన్ని నెలల ముందే …గత ఏడాది నవంబరులో పార్లమెంటరీ పానెల్ ఒకటి ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, హాస్పిటల్స్ లో బెడ్ల సంఖ్యను కూడా పెంచాలని ఆరోగ్యంపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ అధ్యక్షతన గల ఈ కమిటీ.. ఆక్సిజన్ సిలిండర్ల ధరలు పెరగకుండా నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీని కోరింది. దీనివల్ల ఆక్సిజన్ లభ్యతలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని, ఒకే ధరకు ఈ సిలిండర్లు లభించే అవకాశాలు ఉన్నాయని ఈ కమిటీ అభిప్రాయపడింది. హాస్పిటల్స్ డిమాండ్ ను బట్టి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలి.. అలాగే రోగుల అవసరాల మేరకు ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది.. అని పార్లమెంటుకు సమర్పించిన తన నివేదికలో ఈ పానెల్ పేర్కొంది.
పాట్నాలోని ఎయిమ్స్ లో కొంతమంది రోగులు ఆక్సిజన్ సిలిండర్లను పట్టుకుని ఆ మూలకు, ఈ మూలకు తిరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఈ పానెల్ ఆ నాడే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలని, హెల్త్ కేర్ సర్వీసులను వికేంద్రీకరించాలని కూడా ఈ కమిటీ సూచించింది. ఇన్ని సూచనలు చేసినా ఈ నివేదికను పట్టించుకునేవారే లేకపోయారు. కనీసం ఈ సిఫారసుల్లో కొన్నిటినైనా ప్రభుత్వం అమలు చేసి ఉంటే నేడింత అద్వాన్న పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత ఇంత ఉండేది కాదని అంటున్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : Charmy Kaur Video: వాటిని చూసేంత ధైర్యం నాకు లేదు.. అనూహ్య నిర్ణయం తీసుకున్న చార్మి..!( వీడియో) కరోనా కట్టడిలో భాగంగా మరోసారి హాస్టల్స్ ,కోచింగ్ సెంటర్ల క్లోజ్ వీడియో ..Hostel’s closed video.