ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..

మీ దగ్గర సూపర్ ఐడియాస్ ఉన్నాయా ? అయితే మీకు లక్షాధికారే. అవునండి. ఒక్క ఐడియా ఇస్తే.. రూ.5 లక్షలు మీ సొంతం అవుతాయి.

ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..
Idea Money
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 24, 2021 | 12:41 PM

మీ దగ్గర సూపర్ ఐడియాస్ ఉన్నాయా ? అయితే మీకు లక్షాధికారే. అవునండి. ఒక్క ఐడియా ఇస్తే.. రూ.5 లక్షలు మీ సొంతం అవుతాయి. ఎలా అని ఆలోచిస్తున్నారా ? అసలు విషయం ఎంటంటే.. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ కంపెనీ అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. మంచి ఐడియా చెబితే రూ.5 లక్షలు అందిస్తోంది. పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వేస్టేజ్ ను 100 శాతం ఉపయోగించుకోగలిగే ఐడియా ఇవ్వాలి. ఇందుకు రూ.12 లక్షల ఫ్రైజ్ మనీ అందిస్తారు. పర్వావరణం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, వారి సలహాలు తీసుకోవడం వంటివి ఈ కాంపిటీషన్ ముఖ్య ఉద్ధేశం.

ఇక ఐడియాస్ ఆఫర్ మాత్రం 2021 మే 19 వరకే ఉంటుంది. ఈలోగా మీరు మీ దగ్గరున్న ఐడియాస్ ఇవ్వాలి. ఎవరైతే మంచి ఐడియా ఇస్తారో వారికి తొలి బహుమతి కింద రూ.5 లక్షలు ఇస్తారు. విద్యుత్ ఉత్పత్తి సమయంలో పలు రకాల వ్యర్థాలు వెలువడుతున్నాయి. వాటిని ఏం చేయాలి అనే దానికి ఒక సొల్యూషన్ చెప్పాలి. ఈ సంస్థకు 70 పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 26 రెన్యూవబుల్ ప్రాజెక్టులు. ఇంకా 18 జీడబ్ల్యూ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు తయారీలో ఉన్నాయి. కంపెనీ 65825 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. మరీ ఆలస్యం చేయకండీ.. విద్యుత్ సంస్థ పట్ల మీకు అవగాహన ఉంటే ఐడియా ఇవ్వడం మరింత సులభం.

HDFC ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్.. మళ్లీ ఆ సర్వీసులు అందుబాటులోకి..

PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీకు వస్తాయో లేదో తెలుసుకోండి.. ఎలా చెక్ చెయాలంటే..

Covid Scare Rising: మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా ఎంత ఉండాలో తెలుసా..

ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..