PM Modi: స్వామి వేకానందుడుకి ప్రధాని ఘన నివాళి.. ఇవాళ యువతనుద్దేశించి మోడీ ప్రసంగం

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆయనకు నివాళులు అర్పించారు.

PM Modi: స్వామి వేకానందుడుకి ప్రధాని ఘన నివాళి.. ఇవాళ యువతనుద్దేశించి మోడీ ప్రసంగం
Pm Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 12, 2022 | 10:43 AM

PM Modi pays tribute to Swami Vivekananda: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) బుధవారం ఆయనకు నివాళులు అర్పించారు. దేశం కోసం ఆయన కన్న కలలను నెరవేర్చడానికి అందరూ కలిసి పని చేయాలని అన్నారు. స్వామి వివేకానంద(Swami Vivekananda) జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు. అతని జీవితం జాతీయ పునరుజ్జీవనానికి అంకితం చేశారు. ఎందరో యువతను దేశ నిర్మాణం వైపు ప్రేరేపించారు. దేశం కోసం ఆయన కన్న కలలను నెరవేర్చడానికి మనం కలిసి పని చేద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

స్వామి వివేకానంద 159వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం 25వ నేషనల్ యూత్ ఫెస్టివల్‌‌ను ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే తన ప్రసంగం కోసం దేశవ్యాప్తంగా యువతీయువకుల నుంచి సలహాలు, సూచనలను కోరారు. యువత సలహాలు, సూచనలను ప్రధాని తన ప్రసంగంలో జోడించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

నేషనల్ యూత్ ఫెస్టివల్‌కు దేశంలోని ప్రతి జిల్లా నుంచి కూడా యువతీయువకులు పాల్గొంటున్నారు. యూత్ ఫెస్టివల్‌లో భాగంగా జనవరి 13న నేషనల్ యూత్ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. దేశంలోని విభిన్న సంస్కృతులను ఏకతాటికి తీసుకురావడం, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే భావంలో అందరినీ ఏకీకృతం చేయాలనే లక్ష్యంతో సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు.

Read Also…  KCR Politics: తెలంగాణ వేదికగా రాజకీయ సమర శంఖం.. బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్!