KCR Politics: తెలంగాణ వేదికగా రాజకీయ సమర శంఖం.. బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్!

దక్షిణాది దండయాత్రకు శ్రీకారం చుట్టిన ఉత్తరాది నాయక గణమంతా తెలంగాణలో పర్యటిస్తోంది . టాకింగ్ పార్ట్‌తో టెంపర్‌ లేపుతోంది. ఇక, టీఆర్ఎస్ కూడా అదే దూకుడుతో దూసుకుపోతోంది.

KCR Politics: తెలంగాణ వేదికగా రాజకీయ సమర శంఖం.. బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్!
Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 12, 2022 | 9:30 AM

KCR Politics: దక్షిణాది దండయాత్రకు శ్రీకారం చుట్టిన ఉత్తరాది నాయక గణమంతా తెలంగాణ(Telangana)లో పర్యటిస్తోంది . టాకింగ్ పార్ట్‌తో టెంపర్‌ లేపుతోంది. ఇక, టీఆర్ఎస్(TRS) కూడా అదే దూకుడుతో దూసుకుపోతోంది. బీజేపీయేతర జాతీయ నేతలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. ఇటు నుంచి నరుక్కుంటూ వస్తోంది.

ఒకప్పుడు ఇలాంటి రాజకీయాలకు తమిళనాడు అడ్డా. ఇప్పుడు తెలంగాణ గడ్డపై బీజేపీయేతర శక్తులను కూడదీసి….ప్రత్యర్ధిని పడగొట్టే యంత్రం .తంత్రం..మంత్రాంగం నడుస్తోంది..పక్కా వ్యూహంతో గులాబీ బాస్.. కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయే ప్రయత్నం చేస్తున్నారు. రెండ్రోజుల కిందట CPM, CPI జాతీయ లీడర్లతో కీలక సమావేశం జరిపిన కేసీఆర్ తర్వాత RJD లీడర్, బీహార్ ప్రతిపక్షనేత తేజస్వీ ప్రసాద్ యాదవ్‌తో భేటీ అయ్యారు.

బీజేపీ అప్రజాస్వామిక విధానాలు తిప్పికొట్టాలంటే.. ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకంకావాలన్నది CM కేసీఆర్ అభిప్రాయం. భవిష్యత్‌ కార్యాచరణపై తేజస్వీ యాదవ్, KCR ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటు బీహార్ మాజీ CM, తేజస్వీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడారు CM KCR.జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ముందుకు రావాలంటూ KCRని లాలూ ఆహ్వానించారు కూడా…. సో..జాతీయస్థాయిలో చక్రం తిప్పి..బీజేపీని ఎండగట్టి..పడగొట్టాలన్నది గులాబీ బాస్ రాజకీయ పద్మవ్యూహం….ే

మరోవైపు 317పై పోరాటాన్ని రోజురోజుకూ ఉధృతం చేస్తోంది బీజేపీ. ఢిల్లీ నాయకత్వంతో పాటు…ఉత్తరాది అగ్రజులంతా మెరుపులా వచ్చి…టీఆర్ఎస్‌పై ఉరుములతో పిడుగులు కురిపించి మరీ వెళ్తున్నారు. వరుసపెట్టి జిల్లాల్లో సభలు నిర్వహిస్తోంది. మొన్న వరంగల్‌.. నేడు మహబూబ్‌నగర్‌. 317 జీవోను సవరించే వరకు వెనక్కి తగ్గేదిలే అన్నరేంజ్‌లో దూసుకుపోతోంది బీజేపీ. తాజాగా వరంగల్‌ సభకు అసోం CM హిమంత బిశ్వశర్మ వచ్చారు. మహబూబ్‌నగర్‌ సభకు కూడా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ హాజరుకావాల్సి ఉంది. కానీ లాస్ట్‌ మినట్‌లో ఆయన టూర్ రద్దయింది.

మొన్నటికి మొన్ననే బీజేపీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ అడ్డాలో టీఆర్ఎస్‌లో కుటుంబపాలనపై నిప్పులు కురిపిస్తే….ఇప్పుడు అదే బేస్‌లో..సేమ్ పించ్‌లో బీజేపీ నేతలు అదే టెంపోను కంటిన్యూ చేస్తున్నారు. బీజేపీ కౌంటర్ పిన్‌కు ఎన్‌కౌంటర్ పాయింట్‌ వదిలింది టీఆర్ఎస్. అసలు తెలంగాణ ఏంటి..ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలేంటి.అసలు మీరు పాలించే రాష్ట్రాల్లో మా పథకాలున్నాయా…సిద్ధమా చర్చకు…అంటూ గట్టిగానే జవాబిస్తోంది టీఆర్ఎస్. బీజేపీకే కాదు జాతీయ పార్టీలుటార్గెట్‌గా కేటీఆర్ ఓపెన్ ఆఫర్‌ చేశారు. ఇదే రేంజ్‌లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల నుంచి కౌంటర్ పడుతోంది…కేసీఆర్‌ను టచ్‌చేస్తే దేశం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు TRS నేతలు.

హుజురాబాద్ ఎలక్షన్ తర్వాత తెలంగాణ పొలిటికల్ పిక్చర్‌లో మరో టర్నింగ్ పాయింట్‌ 317జీవోపై రాజకీయ పోరాటం. ఒక్కో జాతీయ నేతను రంగంలోకి దించుతోంది. ఆయా రాష్ట్రాల సీఎంలను బరిలోకి దించుతోంది. అధికార పార్టీ తీరును ఎండగడుతూ…తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్న మెస్సేజ్‌ను బలంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఎట్ ద సేమ్ టైమ్..బీజేపీకి ఇంచ్‌ స్పేస్‌ కూడా వదలకుండా కౌంటర్ మీద కౌంటర్ వేస్తోంది టీఆర్ఎస్ . కాషాయం నుంచి వచ్చే ప్రతి సౌండ్‌కు రీసౌండ్‌ను సిద్ధం చేస్తోంది ప్రగతి భవన్. చూడాలి..ఈ రాజకీయ పద్మవ్యూహంలో ఎవరు అర్జునుడు..ఎవరు అభిమన్యుడో….

Read Also…  Supreme Court: ఇంటి నిర్మాణానికి డబ్బు డిమాండ్ చేసినా.. వరకట్నం వేధింపులుగా భావించాల్సిందేః సుప్రీంకోర్టు