Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshadweep: లక్షద్వీప్ మరో ఘనత.. 15-18 ఏళ్ల పిల్లలకు 100 శాతం వ్యాక్సినేషన్..

Covid-19 Vaccination: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా

Lakshadweep: లక్షద్వీప్ మరో ఘనత.. 15-18 ఏళ్ల పిల్లలకు 100 శాతం వ్యాక్సినేషన్..
Child Vaccination
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 12, 2022 | 11:02 AM

Covid-19 Vaccination: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టేందుకు కేంద్రం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. దీంతోపాటు జనవరి ప్రారంభం నుంచి దేశంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ మరో ఘనతను సాధించింది. 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 100 శాతం కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ అందించి.. దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. దేశంలో 15 నుంచి 18 వయస్సు గల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరి 3, 2022న ప్రారంభించారు.

ఈ మేరకు లక్షద్వీప్ జిల్లా కలెక్టర్, కార్యదర్శి ఎస్ అస్కర్ అలీ మాట్లాడుతూ.. దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా కవరత్తిలో చిన్నారులకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ప్రారంభించారని తెలిపారు. లక్షద్వీప్‌లోని పది జనావాసాలున్న దీవుల్లోని పాఠశాలల్లో నిర్వహించిన వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా టీకా డ్రైవ్ ప్రారంభించిన వారంలోపే 3,492 మంది పిల్లలకు వ్యాక్సిన్ లక్ష్యాన్ని సాధించడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారందరికీ 100 శాతం టీకాలు వేసిన కేంద్రాపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలలో లక్షద్వీప్ మొదటిది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. పిల్లలకు టీకాలు వేయడానికి, పెద్దలకు బూస్టర్ డోస్‌లను అందించడానికి తగిన పరిమాణంలో కేంద్రం కోవాక్సిన్ మోతాదులను అందించిందని లక్షద్వీప్ అధికారులు తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ జనవరి 10, 2022 నుంచి ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన పౌరులకు బూస్టర్ డోస్‌లను అందించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

నైట్ కర్ఫ్యూ విధించడం, తప్పనిసరిగా RT-PCR నెగటివ్ సర్టిఫికేట్ చూపించడం, వ్యాక్సినేషన్, టెస్టింగ్, ట్రాకింగ్ వంటి COVID-19 నిర్వహణ చర్యల ద్వారా థర్డ్ వేవ్ కోసం సిద్ధమవుతున్నట్లు కేంద్రపాలిత ప్రాంతం వెల్లడించింది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 153.70 కోట్ల ( 1,53,70,44,657) డోసులు అందించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు అర్హులైన 76 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ డోస్‌లను అందించినట్లు తెలిపింది.

Also Read:

India Covid-19: భారత్‌లో కరోనా తాండవం.. తొలిసారిగా రెండు లక్షలకు చేరువలో రోజువారి కేసులు..

PM Modi: స్వామి వేకానందుడుకి ప్రధాని ఘన నివాళి.. ఇవాళ యువతనుద్దేశించి మోడీ ప్రసంగం