ఘోరం, దారుణం, ఢిల్లీ ఆసుపత్రి ఆవరణలో ‘ఓపెన్ ఐసీయూ’, కోవిడ్ రోగుల పరిస్థితి వర్ణనాతీతం
సువిశాల భారత దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దేశంలోనే అతి పెద్ద హాస్పిటల్ అయిన గురు తేజ్ బహదూర్ (జీటీబీ) హాస్పిటల్ లో కోవిడ్ రోగుల కోసం బయటే...
సువిశాల భారత దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దేశంలోనే అతి పెద్ద హాస్పిటల్ అయిన గురు తేజ్ బహదూర్ (జీటీబీ) హాస్పిటల్ లో కోవిడ్ రోగుల కోసం బయటే… ఆసుపత్రి ఆవరణనే ‘ఓపెన్ ఎయిర్ ఐసీయూ’ గా మార్చేశారు.ఇక్కడ స్ట్రెచర్లపై పలువురు పేషంట్లు ఆక్సిజన్ సిలిండర్లతో కనిపిస్తున్నారు. రోడ్డు పక్కనే వాహనాల రొద, ఎండ వారిని మరింత ప్రమాదంలోకి, అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. వారి వద్ద డాక్టర్లు గానీ, వైద్య సిబ్బంది గానీ కనిపించడంలేదు. వారి బంధువులే తమవారి వద్ద గంటలతరబడి బిక్కుబిక్కుమని నిలబడుతున్నారు. ఈ ఆసుపత్రిలో 400 ఐసీయూ పడకలు ఉన్నా..అన్నీ రోగులతో నిండిపోయాయి. ఓపెన్ ఎయిర్ లో ఉన్న రోగులకు హాస్పిటల్ లో ఎప్పుడు బెడ్లు లభిస్తాయో తెలియదు. ఎవరు తమను ఆదుకుంటారో అంతకన్నా తెలియదు. కొంతమంది మరీ దాదాపు రోడ్డు పైనే స్ట్రెచర్లలో ఉండగా, మరికొంతమంది గేట్ల వద్ద కనిపిస్తున్నారు.
ఢిల్లీలో నిన్న 306 మంది రోగులు మరణించారు. ఒక్కరోజే 26,169 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 36.24 శాతం ఉంది. ఏడాది క్రితం పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంత అత్యధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి.గత 10 రోజుల్లో ఈ నగరంలో 1750 మంది రోగులు మృత్యుబాట పట్టారు. ఇంతజరుగుతున్నా ఎంతసేపూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గానీ .. ఈ మధ్య ఓ చట్టం ద్వారా కేంద్రం అత్యధిక అధికారాలు కట్టబెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. సీఎం కన్నా లెఫ్టినెంట్ గవర్నర్ కి అత్యధిక అధికారాలను అప్పగిస్తూ ఆ మధ్య పార్లమెంటులో ఓ బిల్లును ఆమోదించారు. అది చట్టమైంది.
Why are patients lying on stretchers outside one of the most prominent hospitals in Delhi? India Today’s @KumarKunalmedia reports from outside GTB hospital More #ReporterDiary: https://t.co/FAHzdk9TO8#COVID19 #CoronavirusPandemic #Coronavirus #Delhi pic.twitter.com/Z6TzZmDZ6k
— IndiaToday (@IndiaToday) April 23, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Warplanes: ప్రాణ వాయువును రప్పించేందుకు విహంగాలు.. ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాలు వినియోగిస్తున్న తెలంగాణ సర్కార్