- Telugu News Photo Gallery Political photos Telangana government takes assistance of warplanes for procuring medical oxygen
Warplanes: ప్రాణ వాయువును రప్పించేందుకు విహంగాలు.. ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాలు వినియోగిస్తున్న తెలంగాణ సర్కార్
Updated on: Apr 23, 2021 | 1:49 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాయు మార్గం ద్వారా ఎనిమిది ఆక్సిజన్ ట్యాంకర్లను ఒరిస్సా రాష్ట్రంలోని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు నిర్ణయించారు. ఆక్సిజన్ ట్యాంకర్లను మొదటి సారిగా వాయు మార్గం ద్వారా లిప్ట్ చేయడం జరిగింది.

ఆక్సిజన్‌ను రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది.

వింగ్ కమాండర్ చైతన్య నిజ్హవాన్ ల ఆధ్వర్యంలో ఇండియన్ ఎయిర్ పోర్టుకు చెందిన రెండు C-17 ఎయిర్ క్రాప్ట్ లు వినియోగించారు.

8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.

వాయు మార్గం ద్వారా ట్యాంకర్లను రవాణా చేయడం ద్వారా మూడు రోజుల సమయం ఆదా అవుతుందని, కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా ఉపయోగపడుతుంది.

ఒరిస్సా రాష్ట్రంలోని లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను నుంచి ఆక్సిజన్ తీసుకురావడానికి రక్షణ శాఖకు చెందిన యుద్ధ విమానాల ద్వారా పంపించడం జరిగింది. దీంతో సమయం ఆదా కావడంతో పాటు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి ఉపయోగపడుతుంది.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామాత్యులు ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇతర అధికారులు బేగంపేట విమానాశ్రయం లో ప్రత్యక్షంగా పాల్గొని విమానాల ద్వారా ట్యాంకర్లను పంపే పక్రియను పర్యవేక్షించారు.

Medical Oxygen
