Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo A53s 5G Phone : ఒప్పో A53s 5G ఫోన్ భారత్‌లో ఏప్రిల్ 27 న విడుదల.. ధర రూ.15 వేలు.. అద్భుతమైన ఫీచర్లతో..

Oppo A53s 5G Phone కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు పలు మొబైల్‌ కంపెనీలు రోజురోజుకు కొత్త బ్రాండ్లను విడుదల చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లను.

Oppo A53s 5G Phone : ఒప్పో A53s 5G ఫోన్ భారత్‌లో ఏప్రిల్ 27 న విడుదల.. ధర రూ.15 వేలు.. అద్భుతమైన ఫీచర్లతో..
Oppo A53s 5g Phone
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2021 | 1:44 PM

Oppo A53s 5G Phone కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు పలు మొబైల్‌ కంపెనీలు రోజురోజుకు కొత్త బ్రాండ్లను విడుదల చేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లను జోడిస్తూ మొబైల్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా ఒప్పో నుంచి మరో మొబైల్‌ భారత మార్కెట్లో విడుదల కానుంది. ఒప్పో A53s 5G స్మార్ట్‌ ఫోన్‌ను ఇండియాలో ఈనెల 27న విడుదల కానుంది. ఈ ఒప్పో A53s స్మార్ట్‌ ఫోన్‌ను ధర కూడా తక్కువగానే ఉంది. కేవలం రూ.15వేలలోపు భారత్ మార్కెట్లో విడుదల చేయనుంది. 27న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ఒప్పో తెలిపింది. విడుదల కాగానే ఈ-కామర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఏ సిరీస్‌ వెర్షన్‌లో 5జీ పోర్టు చేసేలా ఉంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌ను ఉపయోగించింది. అయితే ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ట్రిపుల్‌ కెమెరాలు, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్‌ను పరిశీలిస్తే ఇటీవల చైనాలో ప్రారంభించిన OPPO A55 మాదిరిగానే ఉందని తెలుస్తోంది .

అలాగే ఒప్పో ఏ74 5జీ ఫోన్‌ మన దేశంలో విడుదలైంది. రూ.20 వేల లోపు ధరలలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌ను ఉపయోగించింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేను ఇందులో అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను ఇందులో అందించారు.

అయితే ఇందులో కేవలం ఒక్క వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.17,990గా నిర్ణయించారు. ఫ్లూయిడ్ బ్లాక్, ఫెంటాస్టిక్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఏప్రిల్ 26వ తేదీన దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులతో ఈ ఫోన్‌ కొనుగోలు చేస్తే 10శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు 9 నెలల ఈఎంఐలపై ఎలాంటి ఛార్జీలు విధించకుండా అందిస్తున్నాయి.

ఒప్పో ఏ74 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. బ్యాక్‌ కెమెరా 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఫ్రంట్‌ కెమెరా, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇక 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.

ఇవీ చదవండి: Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

Flipkart Delivery : ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం… ఆర్డర్‌ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్‌ డెలివరీ.. ప్రస్తుతం ఏయే నగరాల్లో అంటే..!