AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Northeast Floods: ఉత్తరాదిలో జలప్రళయం.. మళ్లీ ఐఎండీ రెడ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఉత్తరాదిలో జలప్రళయం.. అసోం, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, ముంబై,ఉత్తరాఖండ్‌లోనూ వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రస్తుతం దేశం మొత్తం రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. దేశంలో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు వరదలతో నిండి ఉన్నాయి. నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

Northeast Floods: ఉత్తరాదిలో జలప్రళయం.. మళ్లీ ఐఎండీ రెడ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Northeast Floods
Shaik Madar Saheb
|

Updated on: Jul 10, 2024 | 9:00 AM

Share

ఉత్తరాదిలో జలప్రళయం.. అసోం, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, ముంబై,ఉత్తరాఖండ్‌లోనూ వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రస్తుతం దేశం మొత్తం రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. దేశంలో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు వరదలతో నిండి ఉన్నాయి. నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అసోంలో ఇప్పటికీ లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. అసోంలోని 27 జిల్లాలు వరదలతో ప్రభావితమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది. వర్షాలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 91 రెవెన్యూ, 3వేల 154 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అస్సాంలో వరదల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హిమంత బిస్వా శర్మ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికీ 48వేల మంది షెల్టర్లలో ఉన్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో.. తాజాగా ఏడుగురు మరణించారు.. ఇప్పటివరకు 92 మంది మరణించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం..

ఇక ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 72 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కీలక హైవేలపై రాకపోకలు నిలిపివేశారు. పలు రైల్వే స్టేషన్లు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఇరుక్కుపోయారు.

ఉత్తరప్రదేశ్‌.. హిమాచల్ ప్రదేశ్‌లో

ఉత్తరప్రదేశ్‌లోనూ ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. హైవేలు సహా 70 రోడ్లు మూసివేశారు. బీహార్‌లోని కోసి నది నీటిమట్టం పెరగడంతో వరద ముప్పు పొంచి ఉంది. బీహార్‌లోని నదుల నీటిమట్టం పెరగడంతో 7 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై తీరంలో హై టైడ్ అలర్ట్ జారీ చేశారు. అటు విద్యాసంస్థలు కూడా ఇవాళ బంద్ చేశారు. అంతేకాకుండా కొన్ని చోట్ల లోకల్ ట్రెయిన్స్ కూడా బంద్ అయ్యాయి.

కాగా.. ఈ నెల 12 వరకూ హిమాచల్‌ప్రదేశ్‌, బెంగాల్‌, బీహార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..