National Flag Day: త్రివర్ణ పతాకానికి ముందు భారతదేశ జెండా ఎన్నిసార్లు మార్చిందో తెలుసా..?
ఈరోజు అంటే జూలై 21న భారతదేశంలో జాతీయ పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత జెండాను త్రివర్ణ పతాకం అంటారు. ఇటీవలె స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఘనంగా జరుపుకున్నాం.
ఈరోజు అంటే జూలై 21న భారతదేశంలో జాతీయ పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత జెండాను త్రివర్ణ పతాకం అంటారు. ఇటీవలె స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఘనంగా జరుపుకున్నాం. ప్రతి యేట ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున, జనవరి 26 రిపబ్లిక్ డే రోజున మువ్వెన్నల జెండాకు యావత్ దేశం వందనం చేస్తుంది. అయితే భారతీయ త్రివర్ణ పతాకానికి పెద్ద చరిత్రే ఉంది.
1906లో భారతదేశం తన మొదటి అధికారిక జెండాను రూపొందింది. జాతీయ జెండాను తొలిసారిగా 1906 ఆగస్టు 7వ తేదీన కోల్‌కతాలోని పార్శీ బేగన్ స్క్వేర్‌లో ఎగురవేశారు. నాడు జాతీయ జెండాలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో రూపుదిద్దారు. 1931 సంవత్సరంలో జరిగిన కాంగ్రెస్ మహాసభ మూడు రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించారు. ఆ సమయంలో ఎరుపు స్థానంలో కాషాయం, పసుపు స్థానంలో తెలుపు వచ్చి చేరాయి. మధ్యలో చరఖా చోటుచేసుకుంది. ఇక మనకు జాతీయ జెండాగా తెలిసిన త్రివర్ణ పతాకం. దీనిని అధికారికంగా 1947లో ఎగురవేశారు.
భారత్ జెండాను ఇప్పటి వరకు ఆరుసార్లు మార్చారు. భారతదేశం అధికారిక జెండాను 1906 సంవత్సరంలో కోల్‌కతాలో మొదటిసారిగా ఎగురవేశారు. 1906లో భారతదేశానికి లభించిన జెండా నేటి జెండాకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ జెండాలోని మూడు రంగులు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు. అందులో తామరపువ్వు, చంద్రుడు, సూర్యుడు గుర్తులను జెండా మధ్యలో చేర్చారు. కేవలం ఒక సంవత్సరం తరువాత, అంటే 1907లో, రెండవసారి జాతీయ జెండా రూపు మారింది. దీనిని మేడమ్ భికాజీ కామా కొంతమంది విప్లవ మిత్రులతో కలిసి పారిస్‌లో ఎగురవేశారు. ఈ జెండాలో ఎరుపు రంగుకు బదులు కుంకుమ రంగు, ఎనిమిది తామరపువ్వులకు బదులు ఎనిమిది నక్షత్రాలను చేర్చారు.
దీని తరువాత, 1917 సంవత్సరంలో, లోకమాన్య తిలక్‌తో కలిసి అన్నీ బిసెంట్ మరోసారి కొత్తరూపుతో జెండాను ఎగురవేశారు ఈ జెండా చాలా భిన్నంగా ఉండేది. ఈ జెండాలో ఐదు ఎరుపు చారలు, నాలుగు ఆకుపచ్చ చారలు ఉన్నాయి. యూనియన్ జాక్ ఎడమ వైపున తయారు చేయించారు. చంద్రుడు, నక్షత్రాలు కూడా ఇందులో జత చేశారు. ఆ తర్వాత 1921లో మళ్లీ భారత జెండాలో మార్పు వచ్చింది. విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఈ జెండాను మహాత్మాగాంధీకి అందించారు. దీనితో పాటు స్పిన్నింగ్ వీల్ కూడా జోడించారు.
దీని తరువాత, 1931 సంవత్సరంలో భారతదేశ జెండా మరోసారి మారిపోయింది. ఈ జెండా ఈనాటి జెండాను పోలి ఉంటుంది. ఈ జెండా పైభాగంలో కుంకుమపువ్వు రంగు చార, మధ్యలో తెలుపు, చివరిలో ఆకుపచ్చ ఉంటుంది. మధ్యలో తెల్లటి వర్ణంలో రాట్నం ఉంది. దీనిని భారత కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించింది. ఈ జెండాను మార్చడం ద్వారా, భారతదేశ జెండా చివరిసారిగా జూలై 1947లో మార్చడం జరిగింది. ఆ జెండా ఇప్పటి వరకు వాడుకలో ఉంది. ఈ జెండాలో, పైభాగంలో కాషాయం రంగు, మధ్యలో తెలుపు, దిగువన ఆకు పచ్చ రంగు జత చేరింది. మధ్యలో చరఖా స్థానంలో అశోక చక్రం చేర్చారు. ఈ జెండాను మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు. జెండాలో ఉన్న మూడు రంగుల్లో కాషాయం శక్తికి, ధైర్యానికి ప్రతీక అయితే తెలుపు శాంతికి సత్యానికి గుర్తు. ఇక ఆకుపచ్చ రంగు ప్రగతి, పవిత్రతకు చిహ్నం. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి నిదర్శనం.
1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఓ వ్యక్తి మహాత్మాగాంధీకి జెండా ఇచ్చినప్పుడు ముస్లింల చిహ్నంగా ఒక ఆకుపచ్చ, ఒక ఆకుపచ్చ రంగు మాత్రమే ఉండేవి. ఎరుపు రంగు హిందువుల చిహ్నంగా ఉండేది. అందుకే మహాత్మా గాంధీ భారతదేశంలోని అన్ని ఇతర మతాలు, ప్రజలకు చిహ్నంగా తెలుపు రంగును జోడించారు. అప్పుడు అందులో మూడు రంగులున్నాయి. నేటి త్రివర్ణ పతాకంలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న మువ్వన్నెల జెండాను 1947 జూలై 22న అధికారికంగా జాతీయ జెండాగా ప్రకటించారు. ఈ జెండానే 1947 ఆగస్టు 15 నుంచి ప్రతి యేటా రెపరెపలాడుతోంది.
గతంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం కొన్ని ఆంక్షలు ఉండేవి. ఎంపిక చేసిన రోజుల్లోనే జెండా ఎగురవేయాలనేది ప్రధానమైన నిబంధన. అయితే పారిశ్రామిక వేత్త నవీన్ జిందాన్ పదేళ్ల న్యాయపోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు 2004 జనవరి 23న ఆంక్షలను సడలించింది. జాతీయ జెండాకు సముచిత గౌరవం ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం జెండా ఎగురవేయడం ప్రతి భారతీయుడి హక్కుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…