All Party Meeting: ఏపీ, బీహార్‌కు ప్రత్యేక హోదాపై పార్లమెంటు అఖిలపక్ష భేటీలో హాట్‌హాట్ చర్చ
జాతీయ రాజకీయాల్లో రేపు సూపర్ మండే. జూలై 22న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలకు ఒకరోజు ముందు, అంటే, జూలై 21 అదివారం, ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
జాతీయ రాజకీయాల్లో రేపు సూపర్ మండే. జూలై 22న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలకు ఒకరోజు ముందు, అంటే, జూలై 21 అదివారం, ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌తోపాటు వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సర్వసభ్య ఈ పార్లమెంట్ సెషన్‌లో ప్రభుత్వ ఎజెండా, బిల్లులను ప్రభుత్వం రాజకీయ పార్టీలకు తెలియజేసింది. దీంతో పాటు పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా విపక్షాలను కూడా ప్రభుత్వం కోరింది.
ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంతే కాదు, నీట్ పేపర్ లీక్, బీహార్, ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, దాంతోపాటు అనేక డిమాండ్లను లేవనెత్తాయి ప్రతిపక్ష పార్టీలు. ఈ అఖిలపక్ష సమావేశంలో ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కన్వర్ యాత్రకు సంబంధించి యూపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశానికి టీడీపీ లోక్‌సభా పక్షనేత లావు శ్రీకృష్ణ దేవరాయలు, YCP ఫ్లోర్ లీడర్లు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, BRS నుంచి KR సురేష్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఇక ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎల్లుండి పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ పరిస్థితుల్లో ఆగస్ట్ 12 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.
ఈ సందర్భంగా ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతి పక్షం నుంచి సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. దీనిపై గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ పార్లమెంటులో సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలను అనుమతించాలని కోరారు. కన్వారియా మార్గ్‌లోని తినుబండారాల యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద ఆదేశాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ తప్పుబట్టారు.
సోమవారం, పార్లమెంటు సమావేశాల మొదటి రోజు ఆర్థిక సర్వేను ప్రభుత్వం సభలో సమర్పించనుంది. దీని తర్వాత, మరుసటి రోజు, జూలై 23 న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రాబోయే బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు-2024, బాయిలర్ బిల్లు-2024, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు-2024, కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు-2024 , రబ్బర్ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లులను కూడా ఆమోదించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం సమర్పించనుంది. ఈ సమావేశంలో అన్ని పార్టీలకు ఈ బిల్లులన్నింటికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.
వీడియో..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..