AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు.. సీఎం పినరయ్ విజయన్ కీలక వ్యాఖ్యలు

స్మార్ట్‌ఫోన్లు వచ్చాకా.. ప్రతిఒక్కరూ సోషల్ మీడియాను వాడుతున్నారు. ప్రస్తుతం ఒక్కరోజైన సోషల్ మీడియా వినియోగించకుండా ఎవరూ ఉండలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో గంటల తరబడి మునిగిపోతున్నారు నెటీజన్లు. వీటిని కేవలం సరదా కోసం మాత్రమే కాదు.. దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతోందనే అంశాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు కూడా దర్శనిమిస్తుంటాయి.

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు.. సీఎం పినరయ్ విజయన్ కీలక వ్యాఖ్యలు
Cm Pinarayi Vijayan
Aravind B
|

Updated on: Sep 24, 2023 | 3:49 PM

Share

స్మార్ట్‌ఫోన్లు వచ్చాకా.. ప్రతిఒక్కరూ సోషల్ మీడియాను వాడుతున్నారు. ప్రస్తుతం ఒక్కరోజైన సోషల్ మీడియా వినియోగించకుండా ఎవరూ ఉండలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో గంటల తరబడి మునిగిపోతున్నారు నెటీజన్లు. వీటిని కేవలం సరదా కోసం మాత్రమే కాదు.. దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతోందనే అంశాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు కూడా దర్శనిమిస్తుంటాయి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకొనే అయోమయం నెటిజన్లలో నెలకొంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. త్రికరిపూర్‌లో పార్టీ నూతన కార్యాలయాన్ని సీఎం పినరయ్ విజయన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. తిరువనంతపురంలోని పరశాలకు చెందిన 26 ఏళ్ల కాంగ్రెస్‌ కార్యకర్త అబిన్ కోడంకర సామాజిక మాధ్యమంలో సీపీఎం పార్టీకి చెందినటువంటి సీనియర్‌ నేతల కుటుంబంలోని మహిళలు వేధింపులకు గురి చేశాడు. అభ్యంతరకరమైన ఫొటోలను షేర్‌ చేస్తూ వాళ్లను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేశాడు. ఇక చివరికి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడ్ని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారని.. అయితే దీన్ని వాడేటప్పుడు మన నాగరికతను కోల్పోకూడదని ఆయన తెలిపారు. అలాగే ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మన చర్యలు ఉండకూడదంటూ సూచనలు చేశారు.

రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని.. ఆ పార్టీ సోషల్‌మీడియాను దుర్వినియోగం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారిని ఇబ్బందులను గురిచేయడానికి.. ప్రత్యేక ఏజన్సీలను రాష్ట్రానికి తీసుకొచ్చిందని.. వీటికి లక్షల రూపాయలకు వెచ్చిస్తోందని చెప్పారు. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కకపోవడం వల్ల ఇలాంటి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అయితే ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోందని.. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని.. అధికార పార్టీ నేతల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇలాంటి చర్యలను సహించకూడదని.. తమ పార్టీ కార్యకర్తలకు సూచనలు చేశారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు చెప్పాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..