Minister Kishan Reddy: వందేభారత్ రైళ్ళ ప్రారంబోత్సవంలో ప్రసంగించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ‘ఇదొక చారిత్రక ఘట్టం’
దేశ వ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్‌లో జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. వందేభారత్ రైళ్ళ ప్రారంబోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లుడుతూ.. దేశంలో చారిత్రక, ప్రఖ్యాత111 నగరాలను అనుసంధానం చేస్తూ.. 'ఈరోజు 9 వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రెండు వందే భారత్రైళ్లు వచ్చాయి. ఈ రోజు మూడో వందే..
హైదరాబాద్, సెప్టెంబర్ 24: దేశ వ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్‌లో జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. వందేభారత్ రైళ్ళ ప్రారంబోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లుడుతూ.. దేశంలో చారిత్రక, ప్రఖ్యాత111 నగరాలను అనుసంధానం చేస్తూ.. ‘ఈరోజు 9 వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రెండు వందే భారత్రైళ్లు వచ్చాయి. ఈ రోజు మూడో వందే భారత్.. హైదరాబాద్ – బెంగళూరు రైలును ప్రధాని ప్రారంభిస్తున్నారు. వినాయక చవిత సందర్భంగా మూడో ట్రైన్ ప్రారంభించుకోవడం శుభపరిణాం. హైదరాబాద్ కేంద్రంగా మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం గొప్ప విషయం. మూడు వందే భారత్ రైళ్లను ఇచ్చినందుకు ప్రధాని మోడీ గారికి, రైల్వే శాఖమంత్రి గారికి తెలుగు, తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న.
‘కాచీగూడ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు.. మూడు రాష్ట్రాలను కలుపనుంది. 12 జిల్లాలను కలుపుతూ వెళ్తుంది. రెండు ఐటీ(హైదరాబాద్,బెంగళూరు) రాజధానులను ఈ రైలు అనుసంధానం చేయబోతున్నది. బెంగుళూరుకు వందే భారత్ రైలు రాకతో ఒకే రోజు వెళ్లి రావొచ్చు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్టోబర్1, 3వ తేదీల్లో ప్రధాని మోడీ తెలంగాణకు రాబోతున్నారు. ఆరోజు కూడా అనేక రైల్వే ప్రాజెక్టులకు ఫౌండేషన్స్టోన్ వేయబోతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదిన్నరేండ్లలో ఏటా 55 కిలోమీటర్ల రైల్వే లైన్నిర్మాణం చేపట్టారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ తక్కువగా ఉన్నది. ఆ విషయం గ్రహించే.. ప్రధాని మోడీ అధిక రైల్వే ప్రాజెక్టులు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది రూ.4,418 కోట్ల రైల్వే బడ్జెట్ మోడీ ప్రభుత్వం కేటాయించిందన్నారు’. ఇంకా మాట్లాడుతూ..
‘2014 యూపీయే హయాంలో తెలంగాణకు రైల్వే బడ్జెట్ రూపంలో రూ.258 కోట్లు ప్రవేశపెట్టారు. మోడీ గారు తెలంగాణ రైల్వేల అభివృద్ధి కోసం రూ. 4,418 కోట్లు కేటాయించారంటే.. ఎంత శాతం బడ్జెట్పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో 31 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు రూ.2300 కోట్లతో తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ఆ మధ్య వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు 717 కోట్ల రూపాయలు కేటాయించి, ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలా కాబోతున్నది. నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. కాచీగూడ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. చర్లపల్లిలో రూ. 221 కోట్ల న్యూ టెర్మినల్ నిర్మాణం కాబోతున్నది’.
‘కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఫస్ట్ పేజ్‌లో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవుతుంది. తర్వాత రైలుకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు అక్కడ తయారవుతాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనట్టు.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల కోసం పూర్తి స్థాయిలో సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రజలు రైల్వే సర్వీసులను ఉపయోగించుకోవాలి. వందే భారత్ రైళ్లలో కలిగి అనుభూతి అంతా ఇంతా కాదు. రీజినల్ రోడ్డుతోపాటు దానికి అనుసంధానిస్తూ.. రీజినల్ రైలు రావడం హైదరాబాద్‌కు ఒక గేమ్ చేంజర్‌గా మారబోతున్నది. హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే.. ఆర్ఆర్ఆర్ అత్యంత కీలకం. ట్రిపుల్ఆర్ వస్తే.. కనెక్టివిటీ పెరిగి ఆ రోడ్డు లోపల పేదలకు తక్కువ ధరకు భూములు దొరుకుతాయి. పేదల సొంతింటి కల నెరవేరుతుంది. ఏ రాష్ట్రానికి లేని విధంగా అత్యధికంగా మనకు వందే భారత్ రైళ్లు వస్తున్నాయి.. అందుకు అంకితభావంతో కృషి చేస్తున్న రైల్వే శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ మంద్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.
అక్టోబర్ 1,3 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ అక్టోబర్ 1,3 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీన రైల్వే ప్రాజెక్టు తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ఇనాగ్రేట్ చేయనున్న ప్రధాని మోదీ. ఆ తర్వాత మహబూబ్నగర్ పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. అక్టోబర్ మూడో తారీకున నిజామాబాద్ లో పర్యటిస్తారు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి