Kashmiri Hurriyat Leader: కశ్మీర్ వేర్పాటు వాదులపై కేసు నమోదు చేసిన పాక్.. అసలు కారణం ఏంటంటే..

Kashmiri Hurriyat Leader: ఇస్లామాబాద్‌లోని హౌసింగ్ సొసైటీకి సంబంధించిన రూ. 100 కోట్ల నిధులను దుర్వినియోగం కుంభకోణంలో పలువురు కశ్మీరీ వేర్పాటువాద..

Kashmiri Hurriyat Leader: కశ్మీర్ వేర్పాటు వాదులపై కేసు నమోదు చేసిన పాక్.. అసలు కారణం ఏంటంటే..
Altaf Ahmad Bhat
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 11, 2022 | 10:07 PM

Kashmiri Hurriyat Leader: ఇస్లామాబాద్‌లోని హౌసింగ్ సొసైటీకి సంబంధించిన రూ. 100 కోట్ల నిధులను దుర్వినియోగం కుంభకోణంలో పలువురు కశ్మీరీ వేర్పాటువాద నాయకులపై పాకిస్తాన్‌ దర్యాప్తు సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) కేసు నమోదు చేసింది. కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎంప్లాయిస్ కో ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు అల్తాఫ్ అహ్మద్ భట్ సహా 15 మంది సహచరులపై చీటింగ్, నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారనే అభియోగాల కింద కేసులు నమోదు చేశారు.

నిందితులు భూమి వాస్తవ ధరలకు కాకుండా అధిక ధరలకు ఒప్పందాలు చేసుకున్నారని దర్యాప్తు అధికారులు అభియోగాలు మోపారు. అలాగే.. భూ మార్పిడీ రుసుము చెల్లించకుండానే.. నివాస ప్లాట్లను, వాణిజ్య ప్లాట్లను మార్చడం ద్వారా భూ వినియోగ ఒప్పందాలను ఉల్లంఘించారని ఆరోపించారు. అంతేకాదు.. భూములను భౌతికంగా స్వాధీనం చేసుకోకుండానే.. వాస్తవ భూ యజమానులకు చెల్లింపులు చేశారని దర్యాప్తు ఏజెన్సీ పేర్కొంది. పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఏ.. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు చౌదరి నజీర్ అహ్మద్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎంప్లాయిస్ కో ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడు రాణా లియాకత్ అలీని అరెస్ట్ చేసింది. ఈ కేసులో కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు జాఫర్ అక్బర్ భట్ సోదరుడు అల్తాఫ్ పరారీలో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

ఎన్‌ఐఏకి పట్టుబడిన అల్తాఫ్ సోదరుడు.. ఇదిలాఉంటే.. మాజీ మిలిటెంట్ కమాండర్, వేర్పాటువాద సంస్థ సాల్వేషన్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు జాఫర్‌.. పాకిస్తాన్ ప్రొఫెషనల్ కాలేజీలలో కశ్మీరీ విద్యార్థుల కోసం రిజర్వ్ చేసిన ఎంబీబీఎస్ సీట్లను అక్రమంగా విక్రయించి, అలా వచ్చిన డబ్బును హింసాత్మక కార్యకలాపాలకు సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే జమ్మూ కశ్మీర్ పోలీసులు జాఫర్‌ను అరెస్ట్ చేశారు. కశ్మీర్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జాఫర్‌ను మన దేశానికి చెందిన ఎన్ఐఏ కూడా ప్రశ్నించింది. కాగా, జాఫర్ సోదరుడు అల్తాఫ్ శ్రీనగర్ శివార్లలోని బాగ్-ఎ-మెహతాబ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతను పాకిస్థాన్‌లోని హురియత్ కాన్ఫరెన్స్‌కు ప్రముఖ నాయకుడు.

Also read:

Health Tips: ఎక్కువగా తేనె తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి..

Statue of Equality: సమతా క్షేత్రంలో ఆధ్యాత్మిక వైభవం- పదో రోజు అత్యద్భుతంగా శ్రీభగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం

IRCTC News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 14 నుంచి ఆ సేవలు తిరిగి ప్రారంభం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?