Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: మద్యం షాపులు మూసివేసిన రోజును డ్రై డే అని ఎందుకు అంటారో తెలుసా..! 

డ్రై డే అంటే ఏమిటనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? మద్యం షాపులను మూసివేసిన రోజును డ్రై డే అని ఎందుకు అంటారో తెలుసా.. ఆ విషయాలు మీకోసం..

Knowledge: మద్యం షాపులు మూసివేసిన రోజును డ్రై డే అని ఎందుకు అంటారో తెలుసా..! 
Liquor Shops
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 11, 2022 | 9:27 PM

Why is the day when liquor shops are closed, is called dry day? ఎలక్షన్లు, కొన్ని ప్రత్యేక జాతీయ పండుగుల వంటి సందర్భాల్లో మద్యం దుకాణాలు మూసివేయడం మనం చాలా సార్లు చూశాం. ఆయా రోజుల్లో మద్యం అమ్మకాలు, కొనుగోల్లు పూర్తిగా బంద్‌! మద్యం దుకాణాలు మూసివేసిన రోజును డ్రై డే అని పిలుస్తారు. అంతేకాదు ప్రభుత్వ పత్రాల్లోనూ డ్రై డే అనే పదం వాడటం గమనించేవుంటారు. మద్యానికి బానిసలైన మందు బాబులు ముందుచూపుతో కొంత స్టాక్‌ జమ చేయడం కూడా షరా మామూలే! ఐతే డ్రై డే అంటే ఏమిటనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? మద్యం షాపులను మూసివేసిన రోజును డ్రై డే అని ఎందుకు అంటారో తెలుసా.. ఆ విషయాలు మీకోసం..

డ్రై డే అంటే.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు వేర్వేరు డ్రై డే తేదీలు ఉంటాయి. ఐతే అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 2, ఆగస్ట్ 15, జనవరి 26 తేదీలలో డ్రై డేలను పాటిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లోకాకుండా ప్రతి రాష్ట్రంలో ఒక నిర్దిష్ట రోజున మద్యం అమ్మకాల నిషేధం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో రవిదాస్ జయంతి రోజున మద్యం దుకాణాలు మూసివేస్తారు. రాష్ట్రం, కేంద్రం వేర్వేరు ఎక్సైజ్ విధానాలను కలిగి ఉన్నాయి. దీని ప్రకారం డ్రై డే తేదీని నిర్ణయించారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికలు, ఓటింగ్ ప్రాంతాల్లో కూడా మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది.

డ్రై డే ఎందుకు  పాటిస్తారు? డ్రై డే ప్రకటించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మామూలుగా ఐతే జాతీయ పండుగలు, మతపరమైన పండుగల రోజుల్లో డ్రై డే విధించడం జరుగుతుంది. సైనికులు, అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధులు, మతపరమైన సెంటిమెంట్ల కోసం జాతీయ పండుగల రోజున మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఇవేకాకుండా కొన్నిసార్లు శాంతిభద్రతల కారణంగా కూడా డ్రై డే ప్రకటించడం జరుగుతుంది.

డ్రై డే అనే పేరు ఎందుకు వచ్చింది? నో ఆల్కహాల్ డేని డ్రై డే అని పిలవడానికి ఎటువంటి వాస్తవిక కారణం లేనప్పటికీ, డ్రై అనే పదాన్ని మాత్రం తరచూ మద్యం తాగే వ్యక్తిని ఉద్దేశించి ప్రచారంలోకి వచ్చింది. తగినంతగా నీరు, జ్యూస్ లేదా మరేదైనా పానీయం దొరకనప్పుడు ఈ పదాన్ని వాడుతారు. ఇదేకోవలో మద్యానికి కూడా ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. ఇంగ్లీషులో He’s gone dry now అనే నానుడి ఉంది. మద్యం దుకాణాలు మూత పడిన ఈ రోజున ఎవరూ మద్యం సేవించలేకపోతే దానిని డ్రై డేగా చెబుతారు. ఏదిఏమైనప్పటికీ ఇవన్నీ అధికారిక వివరణలు మాత్రంకాదు.

కాగా 1926లో మన దేశంలోని పంజాబ్‌లో డ్రై డే గురించి మొదటగా ఎక్సైజ్ చట్టంలో ప్రస్తావించబడింది. ఆ తర్వాత కేంద్రం 1950లో దేశమంతటా అమలు చేసింది. దీని తరువాత డ్రై డే అనే పదాన్ని ప్రభుత్వ పత్రాలలో కూడా ఉపయోగించడం ప్రారంభమైంది.

Also Read:

Knowledge: అధిక బరువున్నవారికి పరిశోధకుల హెచ్చరిక! షాకింగ్‌ విషయాలు వెల్లడి..