AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Illicit Relationship: శరీరమంతా కత్తిపోట్లు.. ప్రాణం కోసం కిలోమీటర్ పరుగులు.. అయినా వదల్లే..

అప్పటికే ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాపురం హాయిగా సాగుతోంది. ఇంతలో ఆమె మనసు మరొకరిపై వాలింది. వారిద్దరికీ పరిచయం అయ్యింది.. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆ అక్రమ సంబంధం సదరు వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ఎంతదారుణంగా అంటే.. రక్తం దారలై పారుతున్నా కనికరించకుండా పరుగెత్తించి పరుగెత్తించి మరీ చంపారు.

Illicit Relationship: శరీరమంతా కత్తిపోట్లు.. ప్రాణం కోసం కిలోమీటర్ పరుగులు.. అయినా వదల్లే..
Karnataka Murder
Shiva Prajapati
|

Updated on: May 25, 2023 | 12:38 PM

Share

అప్పటికే ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాపురం హాయిగా సాగుతోంది. ఇంతలో ఆమె మనసు మరొకరిపై వాలింది. వారిద్దరికీ పరిచయం అయ్యింది.. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆ అక్రమ సంబంధం సదరు వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ఎంతదారుణంగా అంటే.. రక్తం దారలై పారుతున్నా కనికరించకుండా పరుగెత్తించి పరుగెత్తించి మరీ చంపారు. ఈ దారుణ ఘటన బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకాలోని సింగ్రహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రదీప్ (27) అదే గ్రామానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే, ఈ విషయం మహిళ భర్తు తెలిసింది. విషయం పోలీసుల వరకు చేరింది. పోలీసులు రాజీ కుదిర్చి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కొద్దిరోజులు సవ్యంగానే ఉన్నప్పటికీ.. వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇద్దరూ తరచుగా కలుసుకోవడం, షరామామూలు అయిపోయింది. విషయం మళ్లీ భర్తకు తెలిసింది. ఈసారి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ భర్త.. ప్రదీప్‌ను మాట్లాడుదామని పిలిచి దారుణంగా హతమార్చాడు.

బుధవారం నాడు అర్థరాత్రి దాటిన తరువాత బయటకు పిలిచి కత్తులతో పొడిచి, దాడి చేసి చంపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్ రక్తం కారుతున్నప్పటికీ ప్రాణాలు కాపాడుకునేందుకు కిలోమీటరు దూరం పరుగెత్తాడు. అయినా వదలకుండా వెంబడించి కొట్టి, నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు దుండగులు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రదీప్‌ను చంపింది మహిళ భర్త వెంకటేష్, మరో వ్యక్తి అయి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..